శ్రమలో సహనం ఉన్నా శ్రమించుటలో శరీరం అనారోగ్యమై సాగిపోతున్నట్లు గుర్తించాలి
ప్రతి రోజు శ్రమించుటలో శరీరంలోని అవయవాలు వివిధ రకాలుగా పనిచేస్తూ అలసిపోతుంటాయి
శ్రమించుటలో శ్వాస కూడా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రక్రియలను సరిగ్గా సాగించలేక పోతుంది
అవయవాలకు శ్రమకు తగ్గ శక్తి సామర్థ్యాలు సహన సిద్ధి పరిశుద్ధమైన ఆహారంతో కలుగుతుంది
అవయవాలకు పరిశుద్ధమైన ఆహారంతో పాటు ప్రశాంతత నిద్ర విరామం సరైన విధంగా కల్పించాలి
శరీరానికి శ్రమతో పాటు వ్యాయామం నడక పరిశుద్ధమైన ప్రకృతి వాతావరణం చాలా అవసరం
శరీరం ఎంత ఉత్తేజంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటే అంతటి శక్తితో శ్రమిస్తూ కార్యాలను సాగిస్తుంది
శ్రమించుటలో కార్యంపై గమనం ఉన్నట్లు శరీర శ్రమ పరిస్థితిపై కూడా గమనం ఉంచితే ఆరోగ్య పరిస్థితి తెలియుట వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతాము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment