సమాజంలో జీవించుటలో స్వచ్ఛమైన గాలి ఉందో లేదో తెలియకుండా జీవిస్తున్నాము
ప్రకృతిలో ప్రాణవాయువు అభివృద్ధి చెందుతూ జీవిస్తూ ఉన్నా సమాజానికే చేరే గాలి కలుషితమై పోతున్నది
ఇంటి ఆవరణంలో మహా వృక్షాల ప్రకృతి పర్యావరణ లేదు స్వచ్ఛమైన ప్రాణవాయువుతో కూడిన గాలి లేదు
సమాజం వ్యాపారాల సంస్థలతో అంగళ్ళతో అంతస్తుల గృహాలతో సూర్యోదయ ప్రకాశం లేక వృక్షాలు లేక కాలుష్యమైన రహదారులతో స్వచ్ఛమైన గాలులు లేక మానవ జీవితం ఊపిరికి ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాసకు కఠినమౌతున్నది
మానవుని నడక లేక వాహనాలతో ధీర్ఘ ప్రయాణాలతో రాకపోకలు వస్తువుల ఎగుమతులు దిగుమతులు ఎన్నో విధాలా సాగుతున్నాయి ఆరోగ్యం లేక అనారోగ్యంతో కాలుష్యంతో జీవితాలు సాగుతున్నాయి
మానవుని శ్రమకు ఫలితం లేక ఆరోగ్యం కూడా అనారోగ్యమౌతున్నది అభివృద్ధి వృధా అవుతున్నది
తరతరాలకు కాలుష్యం పెరుగుతూ ప్రకృతి తరుగుతూ శ్రమకు సహనం లేక ఆలోచనకు ప్రశాంతత లేక మేధస్సుకు ఉత్తేజం లేక కార్యాచరణాలలో పరిశుద్ధత లేక అలవాట్లలో మహా అభిరుచులు లేక యంత్రాల కార్యాలు సాగిపోతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment