Monday, December 8, 2025

ఏ బంధాలు ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాయో ఎవరికి తెలుసో

ఏ బంధాలు ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాయో ఎవరికి తెలుసో 
పరిచయాల బంధాలు మాటలతో సాగే కార్యాలు ఎవరికి ఎంతవరకో 

చదువుల మాటలు ఉద్యోగాల వరకు సాగే పరిచయాల స్నేహ బంధాలు ఎంతవరకో 
మాటల బంధాలు కలుసుకుంటూ సాగే ప్రయాణాలు ఎవరి జీవితాలకు ఎంతవరకో 

బంధాలే నడిపించు మాటలు ఉత్తమమైన సంభాషణలతో కాలాన్ని సాగించు సమయాలు ఎంతవరకో 
కార్యాలే నడిపించు పరిచయాల బంధాలు పరిస్థితులతో సమయాన్ని సాగించు మాటలు ఎంతవరకో 

పరిచయాలను సాగించే యంత్ర పరికరాల మాటలు సమయాన్ని సాగిస్తూనే బంధాలను కలిపేను ఎవరికో  
యంత్ర పరికరాల మాటలతో కార్యాలను సాగించే పరిచయాలు బంధాలతో నడిపించే కార్యక్రమాలు ఎవరికో 

బంధాలు లేని మాటలు పరిచయాలు సాగని సంభాషణలు ఆ కాల సమయం వరకే తెలిసే విషయాలు ఎవరికో 
మాటలు లేని పరిచయాలు కార్యాలను సాగించని బంధాలుగా కాలంతో మిగిలిపోయే ఎన్నో సమస్యలు ఎవరికో  


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment