Friday, December 19, 2025

మన వేళ్ళే మన కళ్ళను పొడిచేస్తాయి

మన వేళ్ళే మన కళ్ళను పొడిచేస్తాయి  

మనకు తెలియకుండానే మన వేళ్ళు మన కంటిని మనం చేసే కార్యాల వల్ల అకస్మాత్తుగా తగులుతూ ఉంటాయి ఎన్నో రకాలుగా ఇబ్బందిని కలిగిస్తాయి 

మన పిల్లల నుండి లేదా ఇతరుల నుండి కూడా కొన్ని సందర్భాలలో కంటికి దెబ్బలు తగులుతూ ఉంటాయి 
పిల్లల నుండి పిల్లలకు చాలా సార్లు వాళ్ళు ఆడే ఆట తీరులకు లేదా వాళ్ళ చేతిలో పట్టుకున్న వాటి నుండి ఎక్కువగా కంటికి గాయాలు అవుతుంటాయి 
నిద్రించుటలో కూడా చాలా వరకు కళ్ళకు ప్రక్కవారి చేతులు తగులుతూ ఉంటాయి 

ఇంటి పై కప్పులను శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి 
వివిధ రకాల గాలులకు చాలా వరకు నేత్రాన్ని కప్పుకోండి 
వాహనాలలో ప్రయాణించేటప్పుడు కళ్ళ జోడు వాడితే చాలా మంచిది - ఎటువంటి నేత్ర రోగములు రాకుండా రక్షిస్తుంది - కళ్ళజోడు కళ్ళకు చాలా సురక్షితమైనవి 

కళ్ళు ప్రతి జీవికి చాలా సున్నితమైనవి (సూక్ష్మమైనవి) జీవించుటకు ప్రధానమైనవి అభివృద్ధికి మార్గాన్ని చూపే
బ్రంహాస్త్ర మైనవి 

ముఖాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు చాలా నెమ్మదిని పాఠించండి 
బయటకు వెళ్ళేటప్పుడు దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్తలు తీసుకోండి 
చిత్ర దృష్టి యంత్రాలను ఎక్కువగా చూడకుండా సరైన దూరం నుండి తక్కువ సమయాన్ని కేటాయించండి 

సూక్ష్మమైన పనులు (సూక్షమైన మరమ్మత్తులు లేదా సూక్ష్మమైన అమరికలు) చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి వాటికి తగ్గట్టుగా దృష్టి దర్శిని అద్దాలను వాడండి 
ఇనుప కడ్డీలను అతికించే టప్పుడు (వృత్తి) మరియు టప్పాసులను కాల్చేటప్పుడు సరైన కళ్ళజోడును ధరించండి 

మన వస్త్రముల నుండి లేదా వివిధ పరికరాల నుండి కూడా నేత్రానికి ఆటంకములు కలగవచ్చు 
ఏవైనా జాడించేటప్పుడు వాటిని సక్రమంగా వాడాలి లేదా మన కంటికి తగులుతాయి అలాగే శరీరానికి కూడా గాయాలవుతాయి 

గింజల పొరలను తీసే విధానంలో లేదా వాటిని పై నుండి క్రిందికి పోసే తీరులో పొట్టు నుండి రక్షించుకోవాలి 
ఎన్ని కార్యాలు చేసినా ఏ కార్యాలు జరిగిపోతున్నా మన నేత్రాలను మన చుట్టూ జరిగే సంఘటనల నుండి రక్షించుకోవాలి మనకు మనమే మన దేహాన్ని రక్షించుకోవాలి 

మన చుట్టూ ఉండేది మనకు తెలియకపోయినా మన ముందు ఉండేది మనం గ్రహించాలి - చూడగలగాలి 

కంటికి సరైన నిద్ర విశ్రాంతి చాలా అవసరం 
కళ్ళు వజ్రముల కన్నా గొప్పవి అత్యంత అద్భుతమైనవి విశ్వ దృశ్యాలను తిలకించే అమృత స్వరూపమైనవి 

నేత్రములు ద్వారా కార్యాలు వేగంగా సాగుతాయి మనం వేగంగా నేర్చుకుంటాం మనం త్వరగా అభివృద్ధిచెందుతాం మన సమస్యలను మనమే తీర్చుకోగలం పరిష్కారించుకోగలం మనకు మనమే ఏదైనా ప్రయత్నించగలం 

మనకు మనమే మన కార్యాలను స్వతహాగా చేసుకోగలం (ఇంకొకరికి భారంగా ఉండదు - ఒకరిపై ఆధారపడటం అవసరం లేదు)

నేత్రములు ఉంటే మరొకరి అవసరం చాలా తక్కువగా ఉంటుంది 
నేత్రములు ద్వారా చాలా విజ్ఞానం కలుగుతుంది అనుభవం పెరుగుతుంది భవిష్య వాణి తెలుస్తుంది 

జ్ఞానేంద్రియాలలో నేత్రం చాలా ప్రధానమైనది భవిష్య తరాన్ని చూపుతుంది 

కళ్ళతో మన శరీరాన్ని మనమే వైద్యం (కొంత వరకు) చేసుకోవచ్చు మన దేహాన్ని మనకు కావలసిన విధంగా ఉంచుకోవచ్చు రక్షించుకోవచ్చు 

కళ్ళను (నేత్రాలను) జాగ్రత్తగా ఉంచుకోండి (ఇతర అపాయముల నుండి ప్రమాదాల నుండి రక్షించుకోండి - ముఖ్యంగా పిల్లలకు రక్షణ అవసరం)
 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment