Wednesday, December 3, 2025

మంచి వారికి మంచి కలగాలని ప్రార్థన చేసుకో

మంచి వారికి మంచి కలగాలని ప్రార్థన చేసుకో 
మంచి తెలియని వారికి మంచి ప్రవర్తన కలగాలని ప్రార్థన చేసుకో 

ప్రదేశమంతా (ప్రకృతి) పరిశుద్ధం కావాలని ప్రార్థన చేసుకో 
సమాజమంతా కాలుష్యం లేకుండా ఉండాలని ప్రార్థన చేసుకో 

ప్రయాణం ప్రశాంతంగా గమ్యాన్ని చేర్చేలా ప్రార్థన చేసుకో  
విజ్ఞానమంతా ప్రయోజనం కావాలని ప్రార్థన చేసుకో 

కుటుంబమంతా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకో 
బంధాలన్నీ ఆరోగ్యాంగా ఉండాలని ప్రార్థన చేసుకో 

కార్యాలన్నీ సహనంతో నైపుణ్యంతో సాగేలా ప్రార్థన చేసుకో 
కాలమంతా విజ్ఞాన అనుభవాలతో సాగేలా ప్రార్థన చేసుకో 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment