Sunday, May 3, 2026

వేగము ఉత్తేజవంతంగా సాగుతుందని మేధస్సు గ్రహించినను విజ్ఞానముతో ప్రమాదమని తలచాలి

వేగము ఉత్తేజవంతంగా సాగుతుందని మేధస్సు గ్రహించినను విజ్ఞానముతో ప్రమాదమని తలచాలి  

వేగం ఎంత ప్రమాదమో తప్పించుకొనుటలో తెలియదు దానిని అనుభవించినప్పుడే పరిస్థితి తెలుపుతుంది 

 వాహన వేగ ప్రమాదాన్ని అనుభవంగా గ్రహించనప్పుడే  వేగాన్ని నియంత్రణతో సాగించాలి 

రహదారి వేగానికి ఎంత అనుకూలంగా ఉన్నా మనం వేగాన్ని అదుపు చేసుకుంటూ అకస్మాత్తుగా కలిగే ప్రమాదాలను తప్పించుకుంటూ సురక్షితంగా ప్రశాంతంగా పరిశోధనతో గమ్యాన్ని చేరుకోవాలి 

ప్రతి ప్రయాణం ఒక విజ్ఞాన పరిశోధన ప్రతి రహదారి ఒక అనుభవమైన వేగ నియంత్రణ ప్రయాణ మార్గం 

ప్రయాణించుటలో వేగమైన రహదారి ఐనా ప్రమాదమైనవే దానితోపాటు మనకు ఎదురుగా వచ్చే వాహనాలు జీవములు వస్తువులు ప్రమాదమైనవే 

ప్రమాదంతో మరణిస్తే నీ భవిష్య కార్యములన్నీ శూన్యం నీ జీవిత ఆశయములు అదృశ్యం నీ శరీర రూపాకారం ప్రకృతి పంచభూతాలలో మలినం బంధాలకు పరిస్థితులను మార్చే జీవన విధానం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment