11, జనవరి 2011, మంగళవారం

నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నీలోని

నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నీలోని ప్రవర్తన మారిపోవాలని ఎవరు తెలుపగలరు
ప్రవర్తనలో మార్పు వస్తే నీలో నీవే నీకు తెలియకనే మారిపోయి జీవితం మారుతుంది
నీ గుణ భావాలను గమనిస్తూ ఆలోచనల అర్థాలను పరిశీలిస్తూ కార్యాలను సాగించు
ఎదుటి వారికి నచ్చని ప్రవర్తనను మానుకుంటూ నీలో మహా గుణ ప్రవర్తన కలగాలి
నీలో ఎంతటి విచక్షణ స్వభావం ఉంటుందో నీ జీవితం అంతటి గొప్పగా సాగుతుంది

మూడు దశాబ్ధాలుగా శ్రమిస్తున్నా

మూడు దశాబ్ధాలుగా శ్రమిస్తున్నా దుఃఖించుటతోనే జీవితం సాగుతున్నది
ముప్పై దశాబ్ధాలుగా శ్రమించినా దుఃఖంతోనే జీవితం సాగితే కాల అర్థమేమి
మేధస్సులో విజ్ఞాన భావాలు లేనందునా జీవితం శ్రమించుటతో దుఃఖిస్తున్నాం
విశ్వ విజ్ఞాన భావాలతో మేధస్సును ఆలోచింప జేస్తే జీవితం ఆత్మానందమే
శతాబ్ధ జీవిత కాలాన్ని దశాబ్ధాలుగా విజ్ఞానంతో సాగిస్తూ యుగాలుగా జీవించు

ఏ రోజు ఎలా సాగుతుందో నీ మీధస్సుకు

ఏ రోజు ఎలా సాగుతుందో నీ మీధస్సుకు కూడా తెలియని విధమే
ఒక్కో రోజు ఒక్కో విధంగా సాగుతూ మరలా మరో రోజు వస్తుంది
ఒక్కో రోజు అనుకున్న విధంగా మరో రోజు తెలియని అసంతృప్తిగా
ఏ రోజు ఎలా సాగుతున్నా ఓ మంచి భావనతో ఆలోచిస్తూ సాగాలి
మహా గొప్ప భావాలే రోజులను కష్టాలను నష్టాలను మరిపిస్తాయి
ఏ సమయం ఎలా ఉన్నా విజ్ఞాన ఆలోచనతో సాగాలని నా భావన

జీవితాన్ని మరిచే ఆలోచన

జీవితాన్ని మరిచే ఆలోచన నీ మేధస్సులోనే ఉన్నది
భావాన్ని మరిచే స్వభావం నీ ఆత్మలోనే ఉన్నది
విశ్వాన్ని మరిచే తత్వం నీ శ్వాసలోనే ఉన్నది
విశ్వ విజ్ఞానాన్ని మరిచే ఆలోచన నా మేధస్సులో లేదు

ఎందుకో నా భావం ఆకలిని తీర్చటం

ఎందుకో నా భావం ఆకలిని తీర్చటం లేదు
నా మేధస్సు స్వభావం ఆహారాన్ని రుచించుట లేదు
రుచి లేక భుజించలేక స్వల్పాహారంతో జీవిస్తున్నాను
నా శరీర తత్వానికి తగిన ఆహారం లభించినా స్వల్పమే
అంతా కాల నిర్ణయమేనని నా మేధస్సు భావ స్వభావం

నీ మేధస్సు స్థితి నీ ఆలోచనలకే

నీ మేధస్సు స్థితి నీ ఆలోచనలకే తెలియకపోతే నీ ఆత్మకు ఏమని తెలియును
నీ స్థితిని నీవు గమనించకపోతే ఆలోచనల భావా స్వభావాలు నీకెలా తెలియును
నీ జీవితాన్ని విజ్ఞానంగా సాగించేందుకు నీ ఆలోచనలలో విశ్వ గమనం సాగాలి
ఆలోచనల గమనమే నీ మేధస్సు స్థితిని ఉత్తేజ భావ స్వభావాలతో కొనసాగిస్తుంది

ఎందరో మహాత్ములు ఎన్నో భావాలతో

ఎందరో మహాత్ములు ఎన్నో భావాలతో ఎన్నో గ్రహించి వెళ్ళిపోయారు
నీవు అలాగే వెళ్ళిపోతే నీ భావాలు ఇంకొకరికి తెలియకుండా పోతాయి
మానవులు మానవులుగా ఇంకా అజ్ఞానంగానే ఆలోచిస్తూ జీవిస్తున్నారు
విజ్ఞానాన్ని కూడా సరిగ్గా తెలుసుకోలేని సమస్యలతో జీవిస్తున్నారు
తమ విజ్ఞానంతో తమ జీవితాన్ని చక్క బెట్టేందుకే నిత్యం ఆలోచిస్తున్నారు
ఇక భావ స్వభావాలను తెలుసుకోవడం ఆత్మ జ్ఞాన అన్వేషణ చేయడం శూన్యమే
విశ్వ విజ్ఞానం అంటే ఏమిటని ప్రశించే జనులు ఎందరో లెక్కకు సరిపోని మాటే
మహాత్ముల భావాలను గ్రహించి ధ్యానిస్తూ విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకో
మానవుడు మహాత్మగా ఎదగాలంటే విశ్వ భావాల ఆత్మ విజ్ఞానమే మార్గం

విశ్వంలో ఓ రూపానికి మరో రూపానికి

విశ్వంలో ఓ రూపానికి మరో రూపానికి ఉన్న కలయికయే స్నేహ భావం
తీరానికి సముద్రానికి ఒడ్డుకు నదికి గట్టుకు చెరువుకు స్నేహ భావమే
కొండకు మట్టికి చెట్లకు నీటికి ఎన్నో విధాల స్నేహ సంబంధాల భావాలే
భూమికి ఆకాశానికి గ్రహానికి నక్షత్రానికి ఎన్నో రకాల స్నేహ బంధాలే
ఒక్కొక్క రకమైన రూపంలో ఎన్నో స్నేహ భావాలు ప్రేమ స్వభావాలు
విశ్వమున ఉన్న రూపాల స్థితి తత్వాలను పరిశీలించి విజ్ఞానాన్ని అన్వేషించు
విశ్వ విజ్ఞానం నీ మేధస్సున చేరేందుకు కాలం ఎదురుచూడదు నీవే గ్రహించాలి

నీవు ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఎన్నో

నీవు ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఎన్నో రకాలుగా తిలకించావు
అన్నీ నీ మేధస్సులోనే అనుభవాలతో జ్ఞాపకంగా ఉన్నాయి
వివిధ భావాలతో వివిధ రూపాలను నీవే తిలకించి ఉన్నావు
విజ్ఞానం కోసం నీలో అన్వేషణ ఉన్నందునే ఎన్నో తిలకించావు
విశ్వం నీకెప్పుడూ విజ్ఞానమే కలిగిస్తుందని నా భావనాలోచన

విజ్ఞాన ఆలోచనతో ధ్యానించు విశ్వ

విజ్ఞాన ఆలోచనతో ధ్యానించు విశ్వ విజ్ఞానం నీలోనే కలుగుతుందేమో
నీ మేధస్సులోనే విశ్వ విజ్ఞానముకై చాల ప్రదేశం ఖాళీగా ఉన్నదేమో
ప్రదేశమంతా పవిత్రంగా మహా దివ్య ప్రకృతి స్వభావాలతో ఉన్నదేమో
విశ్వము దైవత్వంతో ధ్యానించుటకు నీ మేధస్సులో చేరుతుందేమో
నీ మేధస్సును విశ్వ విజ్ఞాన క్షేత్రంగా మార్చుకునేందుకు ఇదే మహా అవకాశమేమో
అవకాశాన్ని వదులుకోకు సమయాన్ని వృధా చేయకు విశ్వ విజ్ఞానాన్ని మరవకు