29, జులై 2026, బుధవారం

కార్యములన్నీ యంత్రములే చేస్తే నీకు సమయమంతా ఖాళీగానే ఉంటుందిగా

కార్యములన్నీ యంత్రములే చేస్తే నీకు సమయమంతా ఖాళీగానే ఉంటుందిగా  

మన దినచర్య కార్యములలో చాలా వరకు యంత్రములు ఎంతో ఉపయోగపడుతున్నాయి సహకరిస్తున్నాయి 
యంత్రములను ఉపయోగించుకోవడం వలన మనకు ఖాళీ సమయం ఎంతో లభిస్తుంది 
ఖాళీ సమయంలో ఎంతో నేర్చుకోవచ్చు ఎన్నో విధాలా ఎన్నో విషయాలను కూడా తెలుసుకోవచ్చు 

నేడు నేర్చుకునేందుకు తెలియనిది తెలుసుకొనుటకు యంత్రములు ఉపయోగపడుతున్నాయి అలాగే యంత్రాలతోనే విద్యాభ్యాసం సాగిపోతున్నది 
యంత్రాల నుండే కావలసిన వాటిని విక్రయించవచ్చు అలాగే యంత్రాల ద్వారానే ఉద్యోగాలను సంపాదించవచ్చు 

ఏ యంత్రాన్ని కనిపెట్టిన తయారుచేసినా మన జీవితాలను బాగా అభివృద్ధి చేసుకొనుటకేనని ఎల్లప్పుడూ (ప్రతి క్షణం) గమనించాలి ఉద్యోగం చేస్తూ ఐశ్వర్యంతో ఎదుగుతూ సాగిపోవాలి  
మన అభివృద్ధి విజ్ఞానంతో ఆరోగ్యంతో ఆనందంతో సామర్థ్యంతో ఐశ్వర్యంతో అనుబంధంతో సంతోషాలతో ఉద్యోగాలతో కుటుంబ సమస్యల పరిస్కారాలతో భవిష్య కార్యాల ప్రణాళికలతో సాగిపోవాలి 

అభివృద్ధి లేనప్పుడు ఏ యంత్రాన్ని ఉపయోగించుకున్నా ఎంతటి విజ్ఞానం తెలివితేటలు ఉన్నా జీవించుటలో జీవితం శూన్యమైపోతున్నదని గ్రహించాలి (నీ జీవితం ఇతరుల కంటే వెనుకబడిపోతుంది ధరలు పెరిగిపోతాయి కుటుంబంలో సామర్థ్యం తగ్గిపోతుంది ఐశ్వరం లేకుండా వెళ్ళిపోతుంది అనారోగ్యం కలుగుతుంది శరీరాలు సహనాన్ని కోల్పోతాయి ప్రతి అవయవానికి ఒక విధమైన అనారోగ్యం ఏర్పడుతుంది సరైన ఆహారం ఉండదు సరైన ప్రదేశం ఉండదు సరైన ఇల్లు ఉండదు సరైన వాతావరణం ఉండదు సరైన ఆలోచన ఉండదు సమస్యలు కఠినమై సంవత్సరాలుగా మిగిలిపోతూ వెంటబడుతాయి)

ఉద్యోగం కోసమే జీవించు ఉద్యోగం కోసమే శ్రమించు ఉద్యోగం కోసమే సాధించు ఉద్యోగం కోసమే విజ్ఞానించు 
ఉద్యోగంతో పాటు నీ కార్యములన్నీ చాలా వరకు యంత్రములే త్వరత్వరగా చకచక చక్కగా కూడా చేసిపెడుతాయి 
యంత్రములను ఉపయోగించే విధానం తెలుసుకో ఉద్యోగం చేసే విధానం కూడా యంత్రమే నేర్పిస్తుంది చేసి పెడుతోంది విశ్రాంతిని కూడా ఇస్తుంది మంచి ఆహారంతో కూడా మంచి సౌకర్యాలతో కూడా జీవించవచ్చు 

ఉన్నచోటే ఉంటావు అన్ని కార్యాలను యంత్రాలతో చేస్తూ అంతటా తిరిగివస్తావు 
అన్నీ తీర్చుకుంటావు సులభంగా శ్రమిస్తూ సంతోషంగా జీవిస్తావు కావలసిన వాటితో అనుభవిస్తూ జీవిస్తావు 

ఇంటిలో యంత్రాలతో పాటు ఇంట్లో ఉన్నవారు నీకు సహాయం చేస్తున్నా ఉద్యోగం కోసం శ్రమించే ఆలోచన లేకుండా యంత్రాలతోనే కాలక్షేపం చేస్తూ మేధస్సును మరో ధ్యాసలో మళ్ళిస్తూ చదివిన విజ్ఞానంతో జీవితాన్ని కోల్పోతూ కుటుంబాన్ని కూడా మరో పరిస్థితితో సాగనిస్తున్నావు 

ఇంటిలో ఒకరు శ్రమించకపోయినా కుటుంబం ఎంతటి వెనుకబడి పోతుందో సమాజంలో (అపారమైన ధరల ఖర్చులు) బంధువుల అంతస్తులలో (అతిశయమే గాని ఉద్యోగ ఆశయ ప్రయత్నం శ్రమించడం లేదు) సరితూగలేనట్లు తెలుస్తున్నది 

-- వివరణ ఇంకా ఉన్నది! 

మానవునికి ప్రతీది సాధనయే ప్రతీది కార్యాచరణమే కార్యాక్రమ జ్ఞానమే

మానవునికి ప్రతీది సాధనయే ప్రతీది కార్యాచరణమే కార్యాక్రమ జ్ఞానమే  

ప్రతి కార్యాన్ని కార్మక్రమ విధానంతో ఆచరణగా పద్ధతిగా సాధనతో సాగించాలి 
కార్యక్రమ విధానం సక్రమంగా ఉంటేనే సరైన సమయానికి సత్ఫలితాన్ని ఇస్తుంది 
కార్యక్రమం తప్పినా కార్య జ్ఞానం లోపించినా కార్య ఫలితం నిష్ప్రయోజనమవుతుంది 

ప్రతి కార్యాన్ని కార్యాక్రమ జ్ఞానంతో పరిశుద్ధంగా సాగిస్తే కార్యఫలితం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది 

సాధనలో సామర్థ్యం విజ్ఞానం సమన్వయము సమయ సారణి కార్య ప్రణాళిక కార్యార్థం పరమార్థం సక్రమంగా ఉండాలి సహనంతో నైపుణ్యంతో అనుభవంతో సాగాలి 

సమస్యలు ఏవైనా ఎన్ని వున్నా ఎంతటి కఠినమైన జీవన విధానంలో జీవనోపాధికై నేర్పరితనం ఉండేందుకు సాధన చేయాలి శిక్షణ పొందాలి అనుభవాన్ని గ్రహించాలి ప్రతి కార్యం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి ప్రవర్తనంగా ఉండాలి 

శ్రమించే విధానంతో చదువుకోవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి జ్ఞాపకాలతో సాగిపోవాలి విజ్ఞానాన్ని సంభాషించాలి ఉత్తీర్ణత పొందాలి అనుభవంతో విశ్లేషించాలి ఒక జీవనోపాధి కార్యంపై ప్రావీణ్యమైన నైపుణ్యాన్ని కలిగివుండాలి ఉద్యోగం తెచ్చుకోవాలి కార్యాజ్ఞానాన్ని పెంచుకోవాలి ఉన్నతమైన స్థానాన్ని పొందాలి కుటుంబంతో బాధ్యతలను తెలుసుకుంటూ సమస్యలను స్వీకరిస్తూ పరిష్కారించాలి అనుబంధమైన జీవితంతో ప్రగతి వైపు సాగిపోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది! 

విశ్వం కాలంతో గాని సమయంతో గాని సాగదు

విశ్వం కాలంతో గాని సమయంతో గాని సాగదు 
విశ్వం వెలుగు చీకటిగా పగలు రాత్రులుగా సాగిపోతున్నది 

మానవుడే మన కార్యాలను సాగించుటకు త్వరగా ముగించుకొనుటకు అభివృద్ధిని సాధించుటకు కార్యాచరణగా పగలు రాత్రిని వివిధ సమయాలుగా (క్షణాలుగా నిమిషాలుగా గంటలుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి) రోజులుగా  నెలలుగా సంవత్సరాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా యుగయుగాలుగా విజ్ఞాన అనుభవంతో  నిర్ణయించుకున్నాడు  


-- వివరణ ఇంకా ఉన్నది!

విశ్వ విజ్ఞానం ఎవరి మేధస్సులో ఉంటుందో పరిశుద్ధంగా పరిశోధనంగా ఎలా పరిభ్రమిస్తుందో

విశ్వ విజ్ఞానం ఎవరి మేధస్సులో ఉంటుందో పరిశుద్ధంగా పరిశోధనంగా ఎలా పరిభ్రమిస్తుందో  
విశ్వ విజ్ఞానం తెలిసినంత మాత్రాన అది విశ్వ విజ్ఞానముగా సిద్ధాంతముగా మహా గ్రంథంగా పరిగణించబడదు 

విశ్వ విజ్ఞానాన్ని విశ్వ కార్యముల కార్యక్రమాలతో సూక్ష్మంగా పరిశోధిస్తూ బ్రంహాండమంతా పర్యవేక్షణ చేస్తూ ప్రకృతి పరిశీలనతో శాస్త్రీయ విధానాన్ని కారణ సిద్ధాంతాన్ని సూత్రములను సూచనలను రక్షణ నియమాలను జీవన విధాన  ప్రభావాలను జీవిత సత్యాలను అణువు పరమాణువుల ఆత్మ పరమాత్మ అంతర్గత స్వభావాల తత్త్వాలచే సంయుక్త  పరమార్థంగా గ్రహించినప్పుడే కాల కార్య జ్ఞానంతో ఆధ్యాత్మిక వేద ఉపనిషత్తులలో నిర్వచనీయముగా గురువులతో  మహా కృత్యముగా నిర్ణయించబడును 

విశ్వ విజ్ఞానం మేధస్సుల నుండి సంభాషణలుగా వేద ఉపనిషత్తులుగా సమైక్య మానవ జీవన విధానములలో ప్రజ్ఞాన చైతన్యంతో సురక్షితంగా తరతరాలుగా యుగయుగాలుగా ప్రశాంతతతో పరిశుద్ధతతో నేర్పరితనంతో ప్రపంచమంతా సమస్యల పరిష్కారాలతో ఉన్నతమైన ప్రభావాలతో కాల కార్య జ్ఞానమై నిఘంటువులా సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

మట్టిలోనే ఉన్నాయి ఆహారాన్ని అభివృద్ధి చేసే పోషకాలు

మట్టిలోనే ఉన్నాయి ఆహారాన్ని అభివృద్ధి చేసే (సహాయక) పోషకాలు స్వచ్ఛమైన నాణ్యమైన లక్షణాలు పరిపూర్ణమైన జీవ సభావ తత్త్వాలు ఆకార రూపాలుగా ఉద్భవింపజేసే గుణాలు పంచభూతాల ఋతువులతో ప్రత్యుత్పత్తిని పొందే మహా ఔషదాలు సాధారణ సమైక్యతను కలిగే అణువుల పరమాణువుల సంయోగాలు పర్యావరణమైన ప్రాణాధార పత్రహరిత ప్రభావాలు సుగంధ పరిమళాలు అమోఘమైన అభిరుచులు మధురమైన మైమరుపులు ఉత్తేజమైన తాజాదనంతో మెరిసే వర్ణాలు పరిశుద్ధమైన సంయోజక కణజాలములు సామర్థ్యం గల సస్యములు 


-- వివరణ ఇంకా ఉన్నది!

నీకు తెలిసిన విజ్ఞానాన్ని పరమార్థంగా వ్రాసుకుంటే ఎందరో చదువుకుంటూ తరతరాలుగా సాగించెదరు

నీకు తెలిసిన విజ్ఞానాన్ని పరమార్థంగా వ్రాసుకుంటే ఎందరో చదువుకుంటూ తరతరాలుగా సాగించెదరు  

నీలోని విజ్ఞానం జీవన విధానం జీవిత సత్యం కార్యక్రమ కార్యాచరణ కారణంగా కాల జ్ఞానంతో తెలియాలి 

కార్య జ్ఞానమే కాల జ్ఞానమై విశ్వ విజ్ఞానమై జీవన విధాన పాఠాలతో జీవిత పరమార్థాలతో సత్యాన్ని గ్రహించాలి  

ప్రతి కార్యంలో ప్రవర్తన క్రమశిక్షణ పర్యవేక్షణ పరిశోధన మొదలై పరిశుద్ధంగా సాగించే కార్యక్రమమై సాగిపోవాలి 

విజ్ఞానంలో మంత్రం అర్థం తెలియకున్నా కార్యంలో గమనం చరణం సమయం ఆలోచన కేంద్రీకృతమై శ్రమ సహనంతో సాగే సాధన ఆశించిన ప్రతి ఫలితాన్ని అందుకోవాలి 

విజ్ఞానముతో గురువుగా తెలియకపోయినా ఉన్నతమైన వ్యకిగా మానవుడిగా మార్గదర్శకుడిగా నీలో నీవు ఉండిపోవాలి నీతో ఉన్నవారు గమనిస్తూ నీ స్వభావాన్ని నేర్చుకోవాలి నీ తత్త్వాన్ని స్మరించాలి నీలా నడుచుకోవాలి 

ఉపయోగమైనది ఏదైనా ప్రయోజనం చేసూకోవడమే విజ్ఞానం అది తెలుసుకోవడం జీవన విధాన సారాంశం 
విజ్ఞానాన్ని సమాజానికి అందించడం మానవ జీవన విధానాన్ని ప్రయోజనకరంగా రక్షణతో అభివృద్ధి చేయడం  

-- వివరణ ఇంకా ఉన్నది!

మర్మాంతర్యామి! పరమాత్మగా నీవు బ్రంహాండమంతా నిలయమై ఉండుటలో పరమార్థం ఏమిటి

మర్మాంతర్యామి! పరమాత్మగా నీవు బ్రంహాండమంతా నిలయమై ఉండుటలో పరమార్థం ఏమిటి  

అంతర్యామిగా విశ్వ రూపములతో ఉద్భవిస్తున్న నీ స్వభావ తత్త్వములు మర్మాంతర్యామిగా మహా రహస్యమై మేధస్సులో మంత్ర ప్రశ్నగా మిగిలిపోయినది 

పరమాత్మ పరమార్థంచే అంతర్యామిగా అంతర్భావాలతో అంతరంగంలో ఉన్న నీవు ధ్యాన పరిశోధన ధార మంత్ర తత్వ జ్ఞానంచే మర్మాంతర్యామిగా శ్వాసలో జీవిస్తూ పంచభూతాలతో నిలయమై సర్వాంతర్యామిగా బ్రంహాండమంతా ఆకార రూపాలతో పరిభ్రమిస్తూనే ఉన్నావు 

శాస్త్రీయం తెలియనంత వరకు పరిశోధనచే శ్రమిస్తూనే జీవన విధానాన్ని విజ్ఞానంతో సాగించుటకు శ్వాస ప్రయాస సాగించాలి సమస్తం అన్వేషిస్తూ సూక్ష్మంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి 

శాస్త్రీయములు అనంతం ప్రతి అణువు యొక్క శాస్త్రీయ విధానం విభేదం ప్రతి పరమాణువు జీవన సిద్ధాంతం విశేషం 


-- వివరణ ఇంకా ఉన్నది!

పరమాత్మా! నీవు నా లాగే జీవిస్తున్నావా

పరమాత్మా! నీవు నా లాగే జీవిస్తున్నావా  
నేను జీవించుటలో నా జీవన విధానంలో నా కార్యములలో నా శరీర శ్రమలో నిత్యం నీవు జీవిస్తున్నావా 

నా విజ్ఞాన ఆలోచనలలో నా ఇంద్రియ స్వభావాలలో విచక్షణ తత్త్వములలో సర్వం నీవు జీవిస్తున్నావా 

ఆరోగ్యం లేకున్నా విజ్ఞానం లేకున్నా ఐశ్వర్యం లేకున్నా ఆనందం లేకున్నా ఆదరణ ఆచరణ లేకున్నా ఫలితం లేకున్నా రక్షణ లేకున్నా సామర్థ్యం లేకున్నా సాధన లేకున్నా విజయం లేకున్నా నిరంతరం అనుబంధాలతో శ్రమిస్తూనే జీవిస్తున్నావా   

పరిశోధన లేకున్నా పరిశుద్ధత లేకున్నా ప్రతిస్పందన లేకున్నా ప్రత్యుత్తరం లేకున్నా పరిశీలన లేకున్నా ప్రబోధన లేకున్నా ప్రజ్ఞానం లేకున్నా ప్రతేజం లేకున్నా ప్రభాతం లేకున్నా ప్రగతి లేకున్నా పరవశించిపోతూ నీవు జీవిస్తున్నావా 

మనస్సులో మంత్రం లేదు వయస్సులో తంత్రం లేదు దేహంలో యంత్రం లేదు మేధస్సులో మర్మం లేదు శరీరంలో అంత్రము లేకున్నా అంతరాత్మవై జీవిస్తున్నావా 
 
జన్మించుటలో అనంతమై శ్వాసతో ఉద్భవిస్తూ జీవించుటలో సర్వం పరిభ్రమిస్తూ బ్రంహాండమంతా ప్రయాణిస్తూనే  జీవిస్తున్నావు 


-- వివరణ ఇంకా ఉన్నది!

28, జులై 2026, మంగళవారం

గడియారం ప్రస్తుత సమయాన్ని తెలుపుతుందే గాని గత కాలాన్ని సూచించదు

గడియారం ప్రస్తుత సమయాన్ని తెలుపుతుందే గాని గత కాలాన్ని సూచించదు  
ఈ రోజు జరుగుతున్న సమయాన్ని క్షణాలుగా నిమిషాలుగా గంటలుగా సూచించగలదు 

నేటి వరకు ఎంత సమయమైనదో విశ్వ కాలం ఎంతో ఏ గడియారం సూచించదు 
గడియారం దిన చర్య కార్యాలకు సమయాన్ని సూచిస్తూ ఆ రోజుకు బాగా ఉపయోగపడుతుంది 

పంచాంగ పుస్తకమైనా తారీకుల పట్టి ఐనా జరిగిన కొంత కాలాన్ని సంవత్సరాలుగా సూచిస్తుందే గాని విశ్వ కాలాన్ని  లెక్కించదు 
మానవ మేధస్సు అవగాహనతో విజ్ఞాన అనుభవంతో కొన్ని యుగాలుగా గడిచిందని విశ్వ కాలాన్ని ఇంచుమించుగా తెలుపగలము (ఖచ్చితంగా ఎవరు తెలుపలేరు ఎవరు గ్రహించలేరు ఎవరు లెక్కించలేరు ఎవరు గుర్తించలేరు)

శూన్యం నుండి శూన్య కాలం మొదటి క్షణం నుండి నేడు అవతరించిన బ్రంహాండమంతా సాగుతున్న కాలాన్ని ఇప్పటి వరకు గడిచిన విశ్వ కాల సమయంగా ఎవరు ఎంతని చెప్పలేరు ఏ గడియారం సూచించదు 

మానవుడు అవతరించి తన విజ్ఞానంతో కొంత కాలానికి అనుభవ పూర్వకంగా గడియాన్ని (దినసరి సమయ యంత్రం) పంచాంగాన్ని తారీఖుల పట్టిని తయారు చేసుకున్నాడు కొంత వరకు కాలాన్ని గతం వైపుగా భవిష్య వైపుగా కొన్ని కార్యాలకు అవసరాలకు కారణాలకు విచారణలకు పరిష్కామములకు లెక్కించగలడు    


-- వివరణ  ఇంకా ఉన్నది!

ఎవరయ్యా నీవు! విశ్వ విజ్ఞానాన్ని ఇలా పరమార్థంగా వ్రాసుకుంటున్నావు

ఎవరయ్యా నీవు! విశ్వ విజ్ఞానాన్ని ఇలా పరమార్థంగా వ్రాసుకుంటున్నావు 
పరిశోధన ఎక్కడ చేస్తున్నావు మహా విజ్ఞాన పరమార్థాన్ని ఎలా గ్రహిస్తున్నావు 

కార్యాచరణను ఎలా తెలుసుకుంటున్నావు కార్యాలను పరిశుద్ధంగా ఎలా సాగిస్తున్నావు 
కార్యక్రమాల శాస్త్రేయాన్ని ఎలా గమనిస్తున్నావు కార్య శ్రమ విధాన ఫలితాన్ని గుర్తిస్తున్నావు 

ప్రకృతిలో పరిశోధన చేసేలా విశ్వతిలో అన్వేషణ చేసేలా కార్యక్రమాలన్నీ కాలంతో తెలుపుకుంటూ నడిపిస్తున్నావు 

ఆది కార్యముల నుండి భవిష్య కార్యముల వరకు ప్రతి విశ్వ కార్యాన్ని అణువుల పరమాణువుల శాస్త్రీయ కార్యక్రమ విధానంగా పరిశోధిస్తూ ప్రకృతి సిద్ధాంతముగా తెలుసుకొని వ్రాసుకుంటున్నావు పరమార్థాన్ని తెలుపుతున్నావు 

ఆధ్యాత్మిక జ్ఞానం నుండి అంతారాత్మ విజ్ఞానంతో బ్రంహాండమంతా పరిభ్రమిస్తూ పరిశోధిస్తూ అన్వేషణతో ఆలోచనలతో పరమాత్మ స్వభావంతో పరంజ్యోతి తత్వములతో పరిపూర్ణమైన దైవ కార్యములతో మేధస్సును స్వయంభువ శక్తితో ఆలోచింపజేస్తున్నావు 

-- వివరణ ఇంకా ఉన్నది!