Saturday, July 4, 2026

తల్లీ! నీ శ్రమను ఎప్పుడు భాగాలుగా చేసి అందిస్తావు

తల్లీ! నీ శ్రమను ఎప్పుడు భాగాలుగా చేసి అందిస్తావు  

నిరంతరం శ్రమిస్తూనే అందరి బాగోగులను చూసుకుంటూ సాగిపోతూనే ఉంటావు 

నిన్ను నీవు చూసుకొనుటకు కూడా నీవు సమయాన్ని తీసుకోకుండా ఎప్పుడూ ఇంటిలోనే ఉంటూ కుటుంబాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూనే ఉంటావు 

కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం చూసుకుంటూనే అప్పుడపుడు వచ్చే బంధువులను స్నేహితులను సంబంధాల వారిని చూసుకుంటూ శ్రమిస్తూనే సాగిపోతావు 

నీ కోసం ఏముందో చూసుకోకుండా ఎవరికీ ఏమి కావాలో ఆలోచిస్తూ వాటి కోసం శ్రమిస్తూ వారిని సంతోషపెడుతూ సాగిపోతావు 

సమస్యలతో ఆటంకాలతో ప్రమాదాలతో కన్నీరు వస్తున్నా కంటికి తెలియకుండా ఆపుకొని ఇతరులకు ధైర్యాన్ని కలిగిస్తూ అన్నింటిని తొలగిస్తావు అన్ని సమస్యలు తీరిపోయేదాక శ్రమతో శ్రద్ధతో ఓపికతో పోరాడుతూనే ఉంటావు 

నీ జీవితం ఎలా ఉందో ఆలోచించకుండా నీ కుటుంబంలో ఉన్నవారి జీవితాలు బాగుండాలని ఆలోచిస్తూ శ్రమిస్తూనే సాగిపోతావు 

నీ పిల్లలను మాత్రమే చూసుకోకుండా వారి పిల్లలను వారి వారి పిల్లలను చూసుకుంటూ బాగోగులను చూస్తూనే కాలాన్ని సాగిస్తూ సమయాన్ని శ్రమగా చేసుకుంటూ సమస్యలకు పరిష్కారం కనిపెడుతూ సాగిపోతావు 

బంధాలు సంబంధాలు సరిగ్గా లేకున్నా నీ శ్రమతో వారిని సరి చేయుటకు ఎన్నో విధాల ప్రయత్నించి ఎందరినో సలహాలకు సహాయాలను కోరుతూ నీ వారందరిని అభివృద్ధి వైపు విజ్ఞానం వైపు ఆరోగ్యం వైపు ఉన్నత స్థాయిలో ఉండాలని నీ శరీరాన్ని శ్రమగా చేసుకుంటూ ఓ మహా యంత్రంగా సాగిపోతున్నావు 

తల్లికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ వారి ఇబ్బందులకు స్పందిస్తుంది సహాయపడుతుంది శ్రమదానం చేస్తుంది సహనంతో సహిస్తుంది ఓర్చుకుంటుంది 

తల్లి పడే తపనం శ్రమించడం బ్రంహకు కూడా తెలియని స్వభావ వేదం 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment