కలను కలంతో కవితగా కలిపి కవిగా కాలంతో కళనై కరిగిపోతున్నా
కనిపించని కలను కాలంతో కవితగా కళ్ళకే కళగా కనిపిస్తూవున్నా
కలైనా కవితైనా కావ్యమైనా కంటికి కనిపించే కర్తవ్యం కలగాలని
కవిగా కన్నులకు కనిపించలేకున్నా కవితయే కాలంతో కాలమంతా కలకాలం కనిపించబోతుంది
కవిగా కలవకపోయినా కవితగా కన్నులకు కళగా కనిపిస్తూ కలిసిపోతున్నా
కనిపించే కవితయే కాలంతో కనిపిస్తూ కవిని కరిగిస్తూ కన్నులలోనే కలకాలం కలిసిపోతున్నది
కవితయే కావ్యమై కారణమే కార్యమై కాలంతో కలిసిపోయి కనిపిస్తున్నది
కాటుక కళ్ళకు కావాలి కర్పూర కాంతిగా కనిపించే కమ్మని కొమ్మల కమలము
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి