Tuesday, July 7, 2026

ప్రయాణించుటలో ప్రతి ఆలోచనను ప్రశాంతంగా చేసుకో

ప్రయాణించుటలో ప్రతి ఆలోచనను ప్రశాంతంగా చేసుకో ప్రతి దృష్టిని గమనంతో అవగాహన చేసుకో  
ధ్యాసను నేత్రంతో మార్గంపై దృష్టి పెడుతూ ముందు వైపుగా సాగుతూ ప్రశాంతంగా అన్నింటిని గమనిస్తూ సాగిపో 

అకస్మాత్తుగా కలిగే ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఎన్నో ఎన్నో విధాలుగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎందరికైనా కలుగుతుంటాయి 

వాహనాల ప్రయాణం అంటేనే వేగంతో సాగే విధానం 
వాహనాల మాదిరి ఆధారంగా వివిధ రకాల ప్రయాణాలు రహదారులలో వివిధ వేగాలతో సాగిపోతుంటాయి 

వాహనాలను నడిపించే వారు కూడా ఎన్నో రకాలుగా కొత్తగా నేర్చిన వారు అనుభవం లేని వారు వేగంగా వెళ్ళేవారు నిదానంగా వెళ్ళేవారు అడ్డదిడ్డంగా వెళ్ళేవారు స్త్రీలు పురుషులు పిల్లలు వయసులో ఉన్నవారు వృద్ధాప్యములో ఉన్నవారు అనారోగ్యులు అజ్ఞానులు వివిధ వేగములతో ప్రయాణిస్తూ ఉంటారు అందరిని గమనిస్తూ మనం ప్రయాణించాలి ఎవరికి ఎటువంటి ఆటంకం తొందరపాటు ఆవేదన కలిగించరాదు 

ఎందరో ఎన్నో కార్యాలతో వివిధ సమస్యలతో వివిధ వృత్తుల పరంగా విద్యాలయాలకు వ్యాపారాలకు ఉద్యోగాలకు కర్మాగారాలకు వైద్యాలయాలకు వివిధ సంస్థలకు వెళ్ళుతూ ప్రయాణిస్తుంటారు 
అందరి గమ్యములు వేరైనా ప్రయాణించే వాహనాల విధానం వేరైనా చేరుకునే గమ్యం ప్రశాంతంగా ఉండాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment