వదిలేస్తే ఏదైనా అలాగే వెళ్ళిపోతుంది కొంచెం కొంచెం లాగేస్తూ ఉంటే కొంతైనా వచ్చేస్తుంది
విజ్ఞానాన్ని నేర్చుకోకుండా అలాగే వదిలేస్తే మేధస్సులో కొంతైనను జ్ఞానము చేరదు
ఆరోగ్యాన్ని కూడా అలాగే వదిలేస్తే శ్రమించుటలో సహనం తగ్గిపోయి సరైన విశ్రాంతి లేక అనారోగ్యం కలుగుతుంది
ఐశ్వర్యమైనను అలాగే ఖర్చులతో వదిలేస్తే భవిష్య సమస్యలకు కావలసినంత ఐశ్వర్యం మిగలకుండా పోతుంది
కొత్త కొత్త విజ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలంటే కొంచెం కొంచెం మేధస్సులో చేర్చుకోవాలి అప్పుడే విజ్ఞానం ఏర్పడి ఉపయోగపడుతుంది
మంచి అలవాటు గొప్ప ప్రయత్నాలతో సాగిపోతే ఎన్నో విజయాలు మన వెంటే వస్తూ చేరిపోతాయి ఉండిపోతాయి
బంధాలను కూడా అలాగే వదిలేస్తే సంబంధాలు కూడా ఎవరికీ తెలియకుండా దూరమై పోతాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment