22, జూన్ 2026, సోమవారం

మాతృత్వం ఎంతటి పరమార్థం ఏనాటి పరమాత్మం

మాతృత్వం ఎంతటి పరమార్థం ఏనాటి పరమాత్మం  
మాతృత్వంలోనే ఉన్నది ఎంతో మహా గుణ కార్యార్థం 
మాతృత్వానికే తెలియును మాతృత్వ ధార అమరత్వం 
మాతృత్వమే అమృత ధార సుధార సుధామృత సుకృతం 

జీవధార కలిగించి అమృత ధారను అందించే అమ్మలోనే ఉంది అమరమైన మహామృతం 
విశ్వ ధాతగా సృష్టించి సర్వ ధాతగా రూపాన్ని కలిగించే అమ్మలోనే ఆకార రూప సర్వాకారం 

అమ్మగా తల్లిగా మాతృత్వమై ఎంతో శ్రద్ధగా బాధ్యతగా నిరంతరం తనవారి కోసమే శ్రమిస్తుంది 
సర్వం సర్వస్వమై మాతృత్వమై ఎంతో సహనంతో సహకారంతో నిత్యం తమవారి కోసమే జీవిస్తుంది  

సమయాన్ని కాలంగా మార్చుకుంటూ సమస్యను సమర్థంగా తెలుసుకుంటూ సమన్వయంతో సాధన చేస్తూ సాధిస్తున్నది మహోదయమైన విజయం 
సమయాన్ని స్థానంగా తెలుసుకుంటూ ఆలోచనలను అర్థంగా మార్చుకుంటూ సందర్భాన్ని సంఘటితత్త్వంతో సాధిస్తుంది మహోన్నతమైన అభ్యుదయం   

కాలం మారుతున్న సృష్టించే స్వభావం మారదు 
సమయం అవుతున్న సృష్టించే తత్త్వం మారదు 

మనలోనే ఉన్నాయి ఎన్నో అర్థాలు పరమార్థాలు పరమాత్మ స్వభావ తత్త్వాల గుణ లక్షణాల సిద్ధాంతాలు 
మనతోనే ఉంటాయి ఎన్నో బంధాలు సంబంధాలు అనుబంధాలు మమకారంతో సాగిపోయే శాస్త్రీయములు 

తరతరాలుగా సాగే జీవన విధానం ఒక్కటే యుగ యుగాలుగా సాగే జీవితాలు కాలంతోనే కలిగే కార్యాల ప్రభావాలే 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి