26, జూన్ 2026, శుక్రవారం

కాలమా! సమయానికి తెలుపవా ఇక్కడే జగతిలో విశ్వ భావాలతో ఉండిపోవాలని

కాలమా! సమయానికి తెలుపవా ఇక్కడే జగతిలో విశ్వ భావాలతో ఉండిపోవాలని 
కార్యమా! కాలానికి తెలుపవా ఇక్కడే జగతిలో విశ్వ తత్వాలతో సాగిపోవాలని  

విశ్వం ఉన్నంతవరకు కాలం సాగుతున్నంతవరకు జగతిలోనే భావ తత్వాలతో జీవించాలని 
లోకం ఉన్నంతవరకు సమయం సాగుతున్నంతవరకు భూలోకంలోనే వేద విజ్ఞానంతో ఎదగాలని 

ఎక్కడ ఉదయించానో గాని సూర్యోదయమై ఉన్నా ఎక్కడ ప్రయాణిస్తానో గాని సూర్యాస్తమై ఉంటున్నా 
ప్రకృతిలోనే ఉన్నా ఆకృతిలోనే ఉన్నా స్వభావాలతో తత్త్వమై విశ్వమంతా జీవంతో వ్యాపిస్తూ ఉంటున్నా  

విశ్వ మేధస్సుతో జీవిస్తూ జగమంతా దాగిన విజ్ఞానాన్ని అణువులతో పరిశోధిస్తూనే అనంతమైన కార్యాలను గమనిస్తున్నా 
దివ్య తేజస్సుతో జీవిస్తూ విశ్వమంతా దాగిన విజ్ఞానాన్ని పరమాణువులతో పరిశోధిస్తూనే అనంతమైన కార్యాలను తిలకిస్తున్నా 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి