25, జూన్ 2026, గురువారం

సూర్యుడు ఎవరో చంద్రుడు ఎవరో తెలుసుకోలేదా

సూర్యుడు ఎవరో చంద్రుడు ఎవరో తెలుసుకోలేదా 
భూమి ఎంతో ఆకాశం ఎంతో ఎప్పుడూ చూసుకోలేదా 

చెట్టు ఏమిటో పర్వతం ఏమిటో ఏనాడు గ్రహించలేదా  
సమయం ఎంతో కాలం ఎంతో ఏనాడు గమనించలేదా 

శ్రమించడం ఆలోచించడం ఎందుకో తోచలేదా  
ప్రయాణం అనుభవం ఏమిటో తెలియదా  

ఆలోచిస్తేనేగా ఏదైనా తెలియడం లేదని చెప్పగలవు 
ఆకలి వేస్తేనేగా శ్రమించడం ఎందుకని గ్రహించగలవు 

ఆహారం నీరు అందుకుంటేనే కదా ఎందుకో తెలుసుకోగలవు 
చూస్తూనే కదా కుటుంబం అనుబంధం ఏమిటో తెలుపగలవు 

స్పందించడం తెలిస్తేనేగా తల్లితండ్రులను పలకరించగలవు 
దేహ స్వభావ తత్త్వాలు ఉంటేనేగా ఏదైనా కోరుకోగలవు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి