చదువుకుంటూ ఉంటే పుస్తకంలో ఉన్న విజ్ఞానమే నీ మేధస్సులో ఉంటుంది
వ్రాసుకుంటూ ఉంటే కొత్త విజ్ఞానం కలుగుతూనే నీ మేధస్సులో చేరిపోతుంది
చదువుకుంటూ వ్రాసుకుంటూ సంభాషిస్తూ అవగాహన చేసుకుంటూ సాగిపోతే కొత్త విజ్ఞానం కలుగుతూ నీ మేధస్సులో నవ విజ్ఞానం చేరిపోతూ ఉంటుంది
సమస్యలను అవగాహన చేసుకుంటూ సాగిపోతే ఎప్పటికైనా పరిష్కారం ఒకరికి తెలిసిన విధంగా లేదా కొత్త విధంగా నీలో కలుగుతుంది
సమయాన్ని సమస్యలతో ఎంతగా అవగాహన చేసుకుంటావో పరమార్థాన్ని ఎలా గ్రహిస్తావో అలాగే నీ విజ్ఞాన సామర్థ్యం వివిధ పరిష్కారాలతో నీకు తెలుస్తుంది
పాఠశాలలో కళాశాలలో బోధన విధానం వివిధ రకాలుగా చదవటం వ్రాయటం ఉపదేశించటం వివరించటం అవగాహన కలిగించటం అర్థాలను గ్రహించటం జ్ఞాపకాలను పరీక్షించటం ఇలా సాగిపోతూనే ఉంటాయి
వివిధ రకాల ఆటల పాటల ద్వారా కూడా వారిలో వివిధ రకాల సామర్థ్యాలు పెరుగుతూ ఆరోగ్యం విజ్ఞానం అనుభవం అభివృద్ధి చెందుతూ ఉంటుంది
నీ మేధస్సులో ఎక్కడ లేని ఎవరిలో లేని విజ్ఞానం కలిగితే నీవు విజ్ఞానవంతుడిగా మేధావుడుగా జీవిస్తావు
నీ ఆలోచనలు నీ కార్యాచరణ విధానాలు నీ ప్రవర్తనలు నీ ప్రత్యుత్తరములు నీ అలవాట్లు ఎలా సాగితే నీ విజ్ఞానం ఆలా అభివృద్ధి చెందుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment