22, జూన్ 2026, సోమవారం

పొదుపు జీవితం అదుపు జీవనం

పొదుపు జీవితం అదుపు జీవనం  

ప్రతి రోజు అదుపు చేసుకుంటే పొదుపుగా అది జీవించుటలో అభివృద్ధి చెందుటకు ఉపయోగపడుతుంది 
ఖర్చులకు పరిమితమైతే ఖర్చులు చేయుటకు కూడా ఐశ్వర్యం లేకుండా పోతుంది నిష్ప్రయోజనమౌతుంది 

ఈనాటి అదుపులు రేపటి పొదుపులు ఐనా రేపటికి పొదుపులు ఉపయోగం లేకుండా పోతున్నాయి 
ఈనాటి అదుపుల రేపటి పొదుపుల ధనం జీవించుటకు కావలసిన వాటి ధరలకు కూడా సరిపోవు 

పొదుపులను రెట్టింపు చేసుకున్నా రేపటి వస్తువుల ధరల దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నాము 

జీవించుటలో అన్నీ ఉండాలంటే జీవితంలో ఏవీ ఉండవు జీవన విధానంలో అభివృద్ధి సాగదు 
అభివృద్ధి కేవలం విజ్ఞానం బంధంతో సరిపోదు ఐశ్వర్యం ఆరోగ్యం గౌరవంతో కూడా సాగిపోవాలి 

మన జీవితంలో జీవన విధానంలో వచ్చేవారి సమస్యలు మనకు తెలియవు గ్రహించలేము 
మనం ఉన్నంతవరకైనా మన బంధాలను ఆనందంగా చూసుకోవాలి మంచి వసతులను కల్పించాలి 

ఐశ్వర్యం లేనప్పుడు మన వాళ్ళకు అవసరమైన వసతులు ఉంటే చాలు విలాస సౌకర్యాలు అవసరం లేదు 
ఉన్న వసతులను పరిమితంగా ఉపయోగిస్తూ పరిశుద్ధంగా ఉంచుకో రక్షణతో చూసుకో ఎప్పటికప్పడు సరిచేసుకో  

వసతులు - అవసరమైన ఖర్చులు - సహజత్వం 
సౌకర్యాలు - అనవసరమైన ఖర్చులు - ఆర్థికతత్త్వం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి