మానవునికి తెలియని విజ్ఞానం విశ్వంలోనే ఉన్నదా
మానవునికి తెలియని విజ్ఞానం విశ్వంలోనే ఎంతో ఉన్నదా
విశ్వ కార్యములలోనే విశ్వ విజ్ఞానం తెలుస్తున్నదా
ప్రకృతి కార్యముల నుండి జీవన విధాన విజ్ఞానం తెలుస్తున్నదా
విశ్వంలో కనిపిస్తున్నదంతా మహా విజ్ఞానం జీవన విధానానికి మహా ప్రయోజనం
విశ్వంలో కలిగే మార్పులన్నీ గొప్ప అనుభవం జీవితాన్ని మార్చుకునే గొప్ప అవకాశం
కాలంతో పాటు సంవత్సరాలుగా ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఎన్నో కార్యక్రమాలు సమస్యలుగా ఏర్పడుతాయి ఆలోచనల విధానాన్ని పరిశోధిస్తాయి పరిష్కారాలను అన్వేషిస్తాయి
.
సూర్యోదయంతో ఎన్నో ఆరోగ్య ప్రక్రియలు జీవులలో కలుగుతాయి అలాగే వివిధ మార్పులు విశ్వ ప్రకృతిలో కలుగుతాయి
సూర్యాస్తమయంతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రక్రియలు జీవులలో మరియు విశ్వ ప్రకృతిలో కూడా ప్రతి రోజు కలుగుతాయి
ప్రకృతి రూపాలలో కూడా ఎంతో విజ్ఞానం వివిధ మార్పులతో ఎన్నో విషయాలుగా వివిధ శాస్త్రీయములు తెలుస్తాయి
మానవ జీవన విధానంలో ఎన్నో కార్యాలు కార్యక్రమాలుగా సిద్ధాంతాలుగా వివిధ పద్ధతులతో ఆచరణలతో శాస్త్రీయ పరంగా సాగిపోతాయి
విశ్వ విజ్ఞానాన్ని సంపూర్ణంగా వివరణతో వివిధ సంభాషణలతో తెలుసుకొనుటకు మానవ జన్మ సరిపోదు
విశ్వంలో విజ్ఞానం శాస్త్రీయంగా ఉన్నా మానవుడు తన ఆలోచనల స్వభావాల భావ తత్వాలతో ఎన్నింటినో వివిధ రకాలుగా మార్చుకుంటూ అనేక భాషలతో వివిధ గమనాలతో యంత్రాలుగా వస్తువులుగా కృత్రిమ ఆకృతులను సృష్టించుకుంటూ ప్రయాణాలను సాగిస్తున్నాడు నిర్మాణ విధానాన్ని మార్చుతున్నాడు
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment