20, జూన్ 2026, శనివారం

విశ్వ కాలమా నీతోనే సాగుతుంది సమయం

విశ్వ కాలమా నీతోనే  సాగుతుంది సమయం 
సమయానికి జరిగిపోయే కార్యాలెన్నో క్రమం 

క్రమంగా సాగిపోయే కార్యాలు సక్రమంగా కార్యక్రమంగా సాగిపోతేనే ప్రకృతి అభివృద్ధి 

తెలుసుకోవాలి కార్యక్రమ విధానం పెంచుకోవాలి కార్యక్రమ నైపుణ్యం చేసుకోవాలి సక్రమమైన కార్యం 

సక్రమమైన కార్యక్రమ విధానమే పరిశుద్ధత కలిగివుంటుంది నైపుణ్యతను పెంచుతుంది సమయాన్ని సమన్వయం చేస్తుంది ఆరోగ్యాన్ని సామర్థ్యంగా ఉంచుతుంది విజ్ఞానాన్ని పద్ధతిగా కలిగిస్తూ సాగిస్తుంది ఆలోచనను అవగాహనతో ఏకాగ్రతను పెంచుతుంది కార్యం విజయవంతం అవుతుంది 

ప్రకృతి సహజంగా తనకు తానుగా  సక్రమంగా కార్యాలను చేసుకుంటూ సాగిపోతుంది 
ప్రకృతిలో అభివృద్ధి ఐనా అనాభివృద్ధి ఐనా కాలంతో పాటు కార్యక్రమంగా సాగిపోతాయి  

మానవ విజ్ఞానంతో సాగే కార్యాలలో అజ్ఞానం మరుపు అజాగ్రత్త ఆవేశం అసమానత విభేదం ఇలా ఎన్నో విధాలా సాగుతూ పోవడం వలన కార్యక్రమాలలో సక్రమం ఉండదు 
కార్యాచరణ తెలిసిన వారే ఏకాగ్రతతో పరిశుద్ధతతో కార్యాలను సక్రమంగా కార్యక్రమంగా సమన్వయంగా సాగిస్తారు 

ప్రకృతి కార్య విధానంలా ఏ జీవి అలా సహజంగా కార్యక్రమంగా ఎల్లపుడు జీవంచదు 

-- వివరణ ఇంకా ఉన్నది!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion