Tuesday, June 23, 2026

ఒకరు చెప్పిన మాట ఇంకొకరికి చెప్పొద్దు ఒకరు చెప్పిన దానిని సరిగ్గా ఉందని అనుకోవద్దు

ఒకరు చెప్పిన మాట ఇంకొకరికి చెప్పొద్దు ఒకరు చెప్పిన దానిని సరిగ్గా ఉందని అనుకోవద్దు  

ఎవరు ఏది తెలిపినా అది వాళ్ళ స్వభావం కాదు ఇంకొకరి నుండి కొన్ని మార్పులతో కలిసి ఉంటుంది 
ఎవరు ఏమి తెలుపకపోయినా ఒకరు స్వతహాగా చెప్పిన దానిని సరైనదేనని ఏ నిర్ణయం తీసుకోవద్దు 

మాటలు ఎన్నో రకాలుగా ఎందరి నుండో ఎన్నో విధాలుగా మారుతూ మాటలుగా చెప్పేస్తూ ఉంటారు 
మాటలు ఏవైనా స్వభావాలతో తత్వాలతో పరిస్థితులతో మారుతూ మాటలుగా వచ్చేస్తూ ఉంటాయి 

 ఎవరి మాటలలోనైనా పరమార్థాన్ని గ్రహిస్తూ మనకు ఏమి అవసరమో వాటిపై దృష్టి ఉంచి సాగిపోవాలి 
ఎవరు ఏ ఏ మాటలతో ఎలా మాట్లాడినా ఆవేశంతో తిరిగి మాట్లాడకుండా సందర్భాన్ని గ్రహిస్తూ వదులుకోవాలి 

మన సమయం మనకు వచ్చేంతవరకు ఓపికతో శ్రద్ధతో అదుపుతో పొదుపుగా సమన్వయంగా సాగిపోవాలి 
మన సమయం మనకు గొప్పగా కలసి వచ్చినా మన అభివృద్ధిపై దృష్టి ఉంచుతూ అందరితో ఒకేలా సాగిపోవాలి 

మనకు ఎవరు ఎలా ఏమన్నారో క్షుణ్ణంగా మనకు తెలియదు 
మనకు ఎవరు ఎలా సహాయం చేశారో పూర్తిగా మనకు తెలియదు 
మనకు ఎవరు ఎలా శ్రమించి ఆదుకున్నారో సంపూర్ణంగా తెలియదు 
మనకు ఎవరు ఎలా ఎప్పుడు స్పందించారో సంపూర్ణంగా తెలియదు 

మాటలన్నీ మూటలుగా కట్టి పెట్టవోయ్ కార్యాలన్నీ జ్ఞానంతో చేసి పెట్టవోయ్ 

-- వివరణ ఇంకా ఉన్నది! 

No comments:

Post a Comment