మహాత్మలా రూపం లేదు మహర్షిలా ఆకృతి లేదు
మానవునిలా రూపమే ఉన్నా మాధవునిలా ఆకారమే ఉన్నా
జీవించుటలో ఎన్నో భావ స్వభావాలు వేద తత్త్వాలు మేధస్సులోనే కలుగుతున్నాయి
ఎదుగుటలో ఎన్నో నాద స్వరాగాలు జీవ ప్రభావాలు దేహస్సులోనే ఏర్పడుతున్నాయి
మనిషిగా కాలంతో సాగుతున్నా కార్యాలతో ఎంతో జ్ఞానం మేధస్సుకే చేరుతున్నది
సదృశిగా సమయంతో వెళ్ళుతున్నా కార్యాలతో ఎంతో వేదం మేధస్సుకే తెలుస్తున్నది
కార్యాలతో సాగే నాలో గమనం అవగాహనాలతో ఏకాగ్రత విశ్వంలో ఏకాంతమై పరమార్థాన్నే గ్రహిస్తున్నది
ఆలోచనలతో సాగే నాలో భావం వివిధ స్వభావాలతో విశ్వంలో లీనమై మహా గుణ తత్వాలనే ఆకర్షిస్తున్నది
జగమంతా ప్రయాణించే మహోదయమైన అద్భుతాల ప్రదేశాల రహస్యాలన్నీ మేధస్సులోనే ఉండిపోయాయి
విశ్వమంతా విహారించే మహోన్నతమైన ఆశ్చర్యాల ప్రదేశాల తీర విషయాలన్నీ మేధస్సులోనే దాగివున్నాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment