సమయాన్ని సామర్థ్యం చేసుకుంటావో పరిష్కారం చేసుకుంటావో
సమయాన్ని విజ్ఞానం చేసుకుంటావో అనుభవం చేసుకుంటావో
సమయంతో సమస్తం తెలుసుకుంటావో సమస్యను తెలుసుకుంటావో
సమయంతో విజయం తెలుసుకుంటావో సాధనను తెలుసుకుంటావో
నీ యందు సమయం ప్రశాంతంగా ఉంటుంది దానిని నీవు ఎలా ఉపయోగించుకుంటావో నీ మేధస్సుకే తెలియాలి
నీ యందు సమయం నిశ్శబ్దంగా ఉంటుంది దానిని నీవు ఎలా పరిశోధించుకుంటావో నీ విజ్ఞానానికే తెలియాలి
నీవు ఎలా ఏ సమయంతో ఎలా ఉంటావో మరో సమయం కూడా అలాగే సాగిపోతుంది
నీవు ప్రతి సమయాన్ని విజ్ఞానంగా ఆలోచిస్తే మరో సమయం కూడా విజ్ఞానంగా సాగిపోతుంది
ప్రతి కార్యం సమయంతో సాగిపోతున్నా నీ సమయం నీ భవిష్య విజయాలకు సాధనగా సాగిపోవాలి
ప్రతి కార్యం శ్రమయంతో సాగిపోతూ నీ ప్రయత్నం నీ భవిష్య జీవితాలకు మార్గదర్శమై సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment