ఆకాశం ఉదయిస్తే కంటి రెప్ప మేల్కోవాలి ఆకాశం అస్తమిస్తే కంటి రెప్ప నిద్రపోవాలి
జగతికి విశ్వానికి ఆకాశం ఎలాంటిదో మన దేహానికి నేత్రానికి కంటి రెప్ప కూడా అలాంటిదే
ఆకాశం ఉదయిస్తే ఎన్నో విశ్వ కార్యాలు ప్రకృతి కార్యాలు క్రమక్రమంగా సూర్య సమయంతో మొదలవుతాయి
ఆకాశం అస్తమిస్తే ఎన్నో విశ్వ కార్యాలు ప్రకృతి కార్యాలు క్రమక్రమంగా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాయి
పగలంతా సూర్య ప్రభావంతో ఎన్నో కార్యాలు సాగిపోతాయి
రాత్రంతా చీకటి ప్రభావంతో ఎన్నో కార్యాలు సాగిపోతాయి
మన శరీరం కూడా అంతే ఆకాశంలా పగలు రాత్రి పనిచేస్తుంది (మేల్కోవడం ఉదయం నిద్రించడం అస్తమయం)
మేల్కోవడానికి నిద్రించడానికి కంటి రెప్ప చాలా అవసరం అదే మన కార్యారంభం కార్యసమయం కార్యజ్ఞానం
నేత్రానికి సామర్థ్యం ధైర్యం రక్షణ ఆరోగ్యం విజ్ఞానం నియమం కంటి రెప్పయే
పగలంతా సూర్య ప్రభావంతో ఉత్తేజంతో శ్రమిస్తూ కార్యాలను సాగిస్తుంది
రాత్రి కూడా విశ్రాంతి నిద్ర ప్రభావంతో శరీర దేహాన్ని సామర్థ్యంగా అభివృద్ధి చేసుకుంటుంది
నిద్రలో మేధస్సు జ్ఞానేంద్రియాలు అవయవాలు శరీర భాగాలు శ్వాస రక్తం కండరాలు నరాలు కణాలు అన్నీ సామర్థ్యాన్ని పెంచుకుని అభివృద్ధి చెందుతాయి
తల్లి తన గర్భంలో శిశువుకు జీవం పోయాలన్నా చలనం కలిగించాలన్నా శ్వాస అందించాలన్నా తను నిద్రపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment