శివయ్యా! నీవు లేని రూపం ఏది నీవు లేని జీవం ఏది
శివయ్యా! నీవు లేని భావం ఏది నీవు లేని తత్త్వం ఏది
కనిపించే రూపాన్ని పంచభూతాలతో శూన్యం చేస్తావు
కనిపించని జీవాన్ని అష్టదిక్కులతో మాయం చేస్తావు
నీలోనే ఉంది స్వరూపం నీలోనే ఉంది సజీవం నీతోనే ఉంది స్వభావం నీతోనే ఉంది సమత్వం
నీలోనే ఉంది సమస్తం నీలోనే ఉంది సమయం నీతోనే ఉంది సమైక్యం నీతోనే ఉంది సదృశ్యం
కాలమైనా నీవే కార్యమైనా నీవే రాజ్యమైనా నీవే భాజ్యమైనా నీవే
దూరమైనా నీవే భారమైనా నీవే పగలు ఐనా నీవే చీకటి ఐనా నీవే
శుభమైన నీవే క్షోభమైనా నీవే పుష్పమైనా నీవే పత్రమైనా నీవే
లాభమైనా నీవే నష్టమైనా నీవే కాంతివైనా నీవే శాంతివైనా నీవే
నీదైనా నీవే నాదైనా నీవే ఎవరిదైనా నీవే ఎంతటిదైనా నీవే
ఎలాగున్నా నీవే ఎక్కడున్నా నీవే ఎప్పుడైనా నీవే ఏదైనా నీవే
శ్వాస ఐనా నీవే ధ్యాస ఐనా నీవే వ్యాసమైనా నీవే కావ్యమైనా నీవే
నాదమైనా నీవే రాగమైనా నీవే గీతమైనా నీవే గేయమైనా నీవే
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment