Friday, June 26, 2026

గృహమంతయు అనేక విధములైన వస్తువులతో వస్త్రములతో యంత్రములతో నిండుకున్నది

గృహమంతయు అనేక విధములైన వస్తువులతో వస్త్రములతో యంత్రములతో ఆభరణాలతో నిండుకున్నది  
గృహమంతయు అనేక విధాలుగా నిండియున్నా ఇంకా ఎన్నో కొత్త కొత్త వస్తువులు తరచుగా వస్తూనే ఉన్నాయి 

ప్రతి గది సగ భాగంతో ఎన్నో వస్తవులతో నిండిపోయి పరిశుద్ధత చేయడానికి కూడా వీలు లేకుండా పోతుంది 

ప్రతి కార్యానికి ఒక యంత్రం ప్రతి పండుగకు పెళ్ళికి ఉత్సవానికి వారానికి ఒక్కొక్క కొత్త వస్త్రం 
ప్రతి ఆటకు ఒక వస్తువు ప్రతి ప్రయాణానికి ఒక వస్తువు ప్రతి ఆందోళనకు ఒక వస్తువు 


సమాజంలో కొత్తగా ఏది కనిపిస్తే అది ఇంటికి వచ్చేస్తుంది కొన్నాళ్ళుగా లేదా కొంత సమయం ఉండి చెడిపోతుంది 
కొంత కాలం ప్రశాంతంగా ఉండాలన్నా గృహంలో కన్నా ప్రకృతిలోనే అక్కడక్కడ దూరంగా ప్రశాంతత లభిస్తుంది 

జీవితమంతా తెలియని సందడితో ఆలోచనలన్నీ ఇరుకుగా గోలగోలగా సాగుతూ శ్రమ కూడా అనారోగ్యం అవుతున్నది ఖర్చులు పెరిగిపోతున్నాయి 

అద్దె గృహమైనా స్వంత గృహమైన జీవించుటలో కాస్త ఊరట ప్రశాంతత ఆరోగ్యం విజ్ఞానం అభివృద్ధి పరిశుద్ధత ఉండాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment