ఎంత దూరమైనా ప్రయాణించు ఎంత కాలమైనా ప్రయాణించు
ప్రయాణించుటలో నీవు పరిశుద్ధమైన విజ్ఞానాన్ని పరిశోధించు
ఎక్కడైనా ప్రయాణించు ఎలాగైనా ప్రయాణించు
ప్రయాణించుటలో విజ్ఞానంతో పాటు అనుభవాలను గ్రహించు
నేటి నీ ప్రయాణం రేపటికి నీ తనయులకు తెలిపే విజ్ఞాన మార్గం సులభమైన ప్రయాణ విధానం
నీ తనయులకు రేపటికి ఎలా ఏ విధంగా ఏ ప్రదేశాన ఏ కార్యం కలుగుతుందో ఎవరికి తెలియును
నేడు నీతో జీవించే వారు రేపటికి నీ తనయులతో నీవు జీవించే ప్రదేశం కూడా మారిపోవచ్చు
నీ తనయులు జీవించే ప్రదేశం పరిశుద్ధంగా పరిశుభ్రతగా ప్రజ్ఞానంగా స్వచ్ఛమైన పర్యావరణతో ఉండేలా నిర్ణయించుకోవాలి
నీ అనుభవాలు నీ తనయులకు మహా విజ్ఞానాన్ని పరిశుద్ధతను కలిగించాలి ఆచరణతో సాగించాలి
నీ కన్నా గొప్పగా గొప్ప ప్రదేశాలలో స్వచ్ఛమైన వాతావరణంతో అవసరమైన సౌకర్యాలతో జీవించాలి
నీ బంధంతో పాటు నీ తనయుల బంధాలు కూడా గొప్పగా సౌకర్యాలతో ప్రశాంతగా పరిశుద్ధంగా తరతరాలుగా జీవించాలి
నీ బంధంతో నేర్చుకున్నవి ఆచరణగా అలాగే సాగుతూ అందరితో ఉత్తమమైన మానవులుగా నీ తనయులు జీవితాన్ని సాగించాలి
నీ తనయులు సమాజానికి మార్గదర్శకంగా సమాజ సేవగా సమాజాన్ని పరిశుద్ధంగా విజ్ఞానంగా మార్చేలా ఉండాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion