వ్రాయుటలో ఒకే విధంగా ఉంటే ఎవరు చదవగలరు
చదువుటలో ఒకే విధంగా ఉంటే ఎవరు చదువుతూ సాగగలరు
వ్రాయుటలో ఉన్న పదాలు ఓకే విధమై ఒకే రకమై అలాగే ఉంటే ఎవరు చదవగలరు ఎలా విజ్ఞానం చెందగలరు
శ్రమించుటలోనైనా పని చేయుటలోనైనా ఒకే విధంగా సాగిపోతే ఫలితాలు ఒకేలా ఉంటే జీవించుటలో విజయాలేవి ఉండవు సాధనలో ఏ మార్పులు ఉండవు నైపుణ్యంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు కార్యంలో ఏ చమత్కారం కలగదు
వ్రాయుటలో పదాలను మార్పులు చేస్తూ పదాలను కలుపుతూ కొత్త పదాలతో ఎన్నో గొప్ప అర్థాలను పరమార్థంగా తెలిపెదను
చదువుటలో కొత్త పదాలు ఎన్నో మహోదయమైన ఉత్తేజమైన స్వభావాలను కలిగిస్తూ విజ్ఞానాన్ని పరిశుద్ధమైన నైపుణ్యతతో అభివృద్ధి చేస్తూ గొప్ప సిద్ధాంతాన్నే తెలిపేను
వ్రాయుటలో చదువుటలో ఎన్నో కొత్త కొత్త కార్యాలను క్రమక్రమంగా వివరించుటలో తెలిసేను విషయాల స్వభావ భావ తత్వాలు జ్ఞాన విజ్ఞాన అనుభవాలు వేద కాల ఆచరణ రహస్యాలు
వ్రాయుటలో చదువుటలో జ్ఞాపకాన్ని పెంచుకుంటూ పోతేనే నీ మేధస్సు మహోదయమైన తేజస్సులతో ఆలోచిస్తూ ఎన్నో విజయాలను అందుకుంటుంది
కార్యగమనంతో తెలిసేను శాస్త్రీయం కార్యాచరణం తెలిసేను సిద్ధాంతం కార్యక్రమణంతో తెలిసేను వేదాంతం
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion