15, జూన్ 2026, సోమవారం

పరమాత్ముని స్వభావంచే జీవించు పరమార్ధంతో పరిశుద్ధతనే పరిశోధించు పర ఆత్మ ప్రజ్ఞానాన్నే పరిశీలించు

పరమాత్ముని స్వభావంచే జీవించు పరమార్ధంతో పరిశుద్ధతనే పరిశోధించు పర ఆత్మ ప్రజ్ఞానాన్నే పరిశీలించు  

సంపూర్ణమైన విజ్ఞానం తెలుసుకోవడం ఒక జన్మలోనే సాధ్యమగునా ఆలోచనలకే అనంతమై విశ్వ విజ్ఞానం పరమార్థమై మేధస్సులోనే చేరిపోవునా తెలుసుకుంటూ సాగిపోతే అణువు పరమాణువు ఆత్మ పరమాత్మగా ఎన్నో ఆకార రూపాలతో ఎన్నో కార్యములు ఎన్నో విధాల భావ స్వభావాల తత్వాల అనుభవాలు ప్రకృతిలోనే శాస్త్రీయమై విజ్ఞాన సిద్ధాంతాలుగా పరిశోధనచే ఎవరికి బ్రంహాండమై మహా గ్రంథంగా నిఘంటువులా సర్వం తెలిసిపోతున్నాయి  

తెలుసుకోవడమేనా! జీవించడం కూడా తెలియాలిగా అన్నింటిని అనుభవిస్తూనే కొత్త కొత్త ఆలోచనలు కాలంతో కలుగుతూనే ఉంటాయిగా అలా సాగిపోతే నీ ఆయుస్సు అమరమై అమృతమై నిత్యం జీవించాలిగా ప్రకృతిలోనే  పరమాత్మమై ఉండిపోవాలిగా సర్వ కార్యాలకు గమనమై పరమార్థాన్ని గ్రహిస్తూ సాగిపోవాలిగా 



-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion