ఓ సూర్యదేవా! నీ రూపం ముందువైపుగా ఎంతో ప్రకాశిస్తూ పగలుగా కనిపిస్తున్నది
ఓ సూర్యధాత! నీ రూపం వెనుకవైపుగా ఎంతో కాలిపోతూ చీకటిగా కనిపించకున్నది
ఎప్పటికి ప్రజ్వలంతో ప్రకాశిస్తూనే జీవిస్తూ ఉంటావా
ఎప్పటికి అఖిలంతో కాలిపోతూనే జీవిస్తూ ఉంటావా
దహనమవుతున్న నీ దేహం ఎంతటి ధైర్యంతో ప్రజ్వలిస్తూనే ఉంటుంది
కాలిపోతున్న నీ రూపం ఎంతటి స్థైర్యంతో విరాజిల్లుతూనే ఉంటుంది
చిరంజీవిగా నీ రూపం చిరస్మరణీయమై చైతన్యంతో ఉంటుంది
పరంజీవిగా నీ దేహం చిద్విలాసమై ఆధ్యాత్మికంతో ఉంటుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment