Thursday, June 11, 2026

కోపాన్నీ వస్తువులపై చూపిస్తే ప్రకృతికి ఆగ్రహం కలుగుతుందా

కోపాన్నీ వస్తువులపై చూపిస్తే ప్రకృతికి ఆగ్రహం కలుగుతుందా 
కోపానికి వస్తువులు చెడిపోతే విరిగిపోతే ఐశ్వర్యం తగ్గిపోతుందా 

కోపాన్ని వివిధ రకాలుగా ప్రదర్శిస్తే ఇంటిలో ఉన్న వారంతా ప్రశాంతంగా ఉండగలరా 
కోపం ఎటువంటి గుణమో ఎటువంటి లక్షణమో స్పందించుటలో తెలుస్తుంది కనిపిస్తుంది 

కోపాన్ని ప్రదర్శించడం ఒక ఎత్తైతే దానిని అనుభవించడం ఒదిగి ఉండడం మరో ఎత్తు 

కోపానికి కోపం తోడైతే ఏం జరుగుతుంతో ఇద్దరికీ ఆ సమయంలో తోచదు అలాగే వారిలో లేని లక్షణాలు భయంకరంగా కలుగుతాయి 

కోపం నష్ఠంగా ఉండవచ్చు భయంకరంగా ఉండవచ్చు బాధగా ఉండవచ్చు అయోమయంగా ఉండవచ్చు 
వినడానికి ఇష్టం లేనప్పుడు చెప్పినది చేయలేనప్పుడు చేసే కార్యంలో ఆటంకం కలిగినప్పుడు కోపం ఉట్టిపడుతుంది శరీరం దద్దరిల్లి పోతుంది అరుపులతో భయం కలుగుతుంది హృదయం బెదిరిపోతుంది మేధస్సు తడబడుతుంది మనస్సు చెదిరిపోతుంది ఇల్లు అమానుషంగా మారుతుంది 

కోపాన్ని ప్రశాంతం చేసుకోవాలి బంధాలను అర్థం చేసుకోవాలి సమస్యలను శ్రమించుటచే పరిష్కారించుకోవాలి 
కోపాన్ని ప్రశాంతం చేసుకొనుటకు ఇతరులను మౌనంగా ఉండేలా చేస్తారు వారు మౌనంగా ఉంటారు 

-- వివరణ ఇంకా ఉన్నది! 

No comments:

Post a Comment