15, జూన్ 2026, సోమవారం

కార్యంతోనే సాగిపోతున్నావా కార్యంతోనే ఉంటున్నావా

కార్యంతోనే సాగిపోతున్నావా కార్యంతోనే ఉంటున్నావా 
కార్యాలతోనే సాగిపోవద్దు కార్యాలతోనే ఉండిపోవద్దు 

కార్యాలతో పాటు విశ్రాంతిని పొందుతూ సమయానికి ఆహారం నీళ్ళు సేవిస్తూ ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి 

కార్యాలు ఎప్పుడూ ఉంటాయి చేస్తూపోతే తినడానికి కూడా సమయం లేకుండా పోతుంది మనం ఉన్నామనే ధ్యాస కూడా కలగకుండా పోతుంది శరీరానికి ఏది కావాలో మేధస్సుకు ఆలోచన లేకుండా కార్యాలు సాగిపోతూనే ఉంటాయి 

కార్యాలతో పాటు మనకు ఏ సమయానికి ఏమి కావాలో చూసుకోవాలి అలాగే మన కుటుంబానికి ఏది అవసరమో అది చేసుకుంటూ అన్నింటిని సమపాలలో ఆలోచిస్తూ సమన్వయంగా సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి