జీవించుటలోనే ఉన్నాయి ఎన్నో తెలుసుకొనుటలోనే తెలియపోతున్నాయి ఎన్నెన్నో
మరచిపోవుటచే మరుపు కలుగుతుందా కార్యాలోచనచే చేసే కార్యాలన్నింటిపై గమనించే ఏక కాలంలో (ప్రతి క్షణం) ఏకాగ్రత చేసే సామర్థ్యం మేధస్సుకు లేదా
ప్రతి కార్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకంగా గుర్తించుకునే గుర్తు చేసుకునే సామర్థ్యం మేధస్సుకు మనస్సుకు ఉండదా
జీవించుటలో ఎన్నో కార్యాలను చేసుకుంటూ పోతే అలసిపోవుటచే సహనం తగ్గిపోతుంటే మేధస్సులో ఐనా శరీరంలో ఐనా సామర్థ్యం తగ్గిపోతుంటే మరచిపోవుటచే మరుపు చేరిపోతుంది గుర్తు చేసుకునే సమయం కార్యక్రమం లేకుండా పోతుంది
మానవ జన్మకు ఆలోచనలు ఎన్నో కార్యాలెన్నో శ్రమించే సమస్యలు ఎన్నెన్నో
ఎంతటి విజ్ఞానంతో ఎరుకగా ఉన్నా అజ్ఞానం అనారోగ్యం అజాగ్రత్త అశుద్ధత కాలంతో వెంటాడుతూనే ఉంటాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment