మేధావులందరు మహాత్ములుగా ఎక్కడ ఉన్నారో ఎలా జీవన విధానాన్ని సాగిస్తున్నారో
మేధావుల విజ్ఞానంతో నడిచే మన జీవితాలు ఆచరణగా తరతరాలుగా సాగిపోతున్నాయి
ఆనాటి మేధావుల విఙ్ఞానం ఎంతటి పరమార్థమో నేటి విజ్ఞానం ఎంతటి పరిశోధనమో తెలుసుకోవాలి
జీవించుటలో అవసరం ఎలాంటిది జీవన విధానంలో జీవితం ఎంతటిదో తెలుసుకుంటేనే ఆచరించగలవు
ఆహారం కోసం శ్రమిస్తున్నావా విజ్ఞానం కోసం ప్రయాణిస్తున్నావా విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్నావా
ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నావా అనుభవం కోసం అన్వేషిస్తున్నావా విజయం కోసం సాధన చేస్తున్నావా
పరిశుద్ధత కోసం ప్రార్థిస్తున్నావా ఐశ్వర్యం కోసం ఎదుగుతున్నావా సౌకర్యాల కోసం తిరుగుతున్నావా
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment