చదువుతున్నావు తెలుసుకున్నావు నేర్చుకున్నావు జ్ఞాపకం చేసుకున్నావు జ్ఞానాన్ని గ్రహించావు
చదువుతున్న దానిని తెలుసుకొని నేర్చుకొని జ్ఞాపం చేసుకొని అర్థాన్ని గ్రహించి జ్ఞానాన్ని ఆర్జించావు మేధస్సులో దాచుకున్నావు
చదువుకున్న దానిని దాచుకోవద్దు నేర్చుకున్న దానిని విడిచిపెట్టొద్దు తెలిసిన దానిని మరచిపోవద్దు
చదువుకున్న విజ్ఞానాన్ని అందరికి పంచుతూ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ విజ్ఞానంతోనే తరతరాలుగా సాగిపోవాలి
చదువుకున్నది నీ కోసం మాత్రమే కాదు అది ఎందరికో తరతరాలుగా సాగే విజ్ఞాన ప్రవాహం జీవితాన్ని ప్రశాంతంగా సాగించుటకు సమస్యలను పరిష్కారించే నిఘంటువు ఆయుధం (పరికరాల పేటిక)
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment