నడకలతో సమయం గడిచిపోతుంది పరుగులతో కాలం సాగిపోతుంది
నడవడం నేర్చుకుంటే పరుగులు వేయడం తెలుస్తుంది
జ్ఞానం తెలుసుకుంటే విజ్ఞానం తెలుస్తుంది
విజ్ఞానం తెలుసుకుంటే ప్రజ్ఞానం తెలుస్తుంది
ప్రజ్ఞానం తెలుసుకుంటే వైజ్ఞానికం తెలుస్తుంది
వైజ్ఞానికం తెలుసుకుంటే విశ్వజ్ఞానం తెలుస్తుంది
నడవడం జ్ఞానమైతే పరుగులు విజ్ఞానమై సాగిపోతాయి
నడవడంతో పడిపోతే లేవగలవు పరుగులతో ప్రమాదమైతే పరిస్థితి మారిపోతుంది
జీవితంలో ఎక్కడ నడవాలో ఎక్కడ పరుగులు తీయాలో తెలిసినా జాగ్రత్తగా అనుభవంతో సమయ భావంతో సమన్వయంగా సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment