జగతికి నేను ఎవరినో విశ్వానికి నేను తెలియని వాడినో
విశ్వానికే తెలియని నేను జగతికి ఎలా తెలిసిన వాడినో
నాలో విజ్ఞానం ఉన్నదో ఏమో పరిశోధనలో ఏమని తెలిసినదో
నాలో అభిజ్ఞం ఉన్నదో ఏమో అన్వేషణలో ఏమని తెలిసినదో
విశ్వ విజ్ఞానమంతయు మేధస్సులోనే మర్మంగా దాచుకున్న పర ఆత్మ ప్రభూత జ్ఞానినో
వేద స్వభావమంతయు మనస్సులోనే ధర్మంగా నింపుకున్న పర ధ్యాస సంభూత జ్ఞానినో
ఆకాశానికే తెలియని అంచులలో విహరించే విశ్వ జ్ఞానినై మహాత్మగా అవతరించిన పర ఆత్మను నేనేనేమో
సాగరానికే తెలియని తీరాలలో తరంగించే దైవ ధ్యానినై మహర్షిగా ఆవరించిన పర ధూతను నేనేనేమో
సమయానికైనా సమస్తం తెలిసేలా విజ్ఞాన నిఘంటువు ఎక్కడ లిఖితమౌతున్నదో
కార్యానికైనా సమయం తెలిసేలా ప్రజ్ఞాన ప్రబంధము ఎక్కడ రచించితమౌతున్నదో
కార్య జ్ఞానం కాల సమయంతో సాగుతున్న జ్ఞానంగా గుర్తిస్తూ విశ్వ మేధస్సుతో లిఖించేదెవరో
వేద కార్యం కాల సమయంతో సాగుతున్న కార్యంగా సూచిస్తూ దైవ మేధస్సులో రచించేదెవరో
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి