దర్శించవా నీవు దర్శించవా పరమాత్మ స్వరూపాన్ని నీ ఎదుటనే
స్మరించవా నీవు స్మరించవా పరంజ్యోతి స్వరూపాన్ని నీ ఎదుటనే
నీ యందు ఆత్మజ్యోతిగా పరరూప ప్రభూతంచే దేహంలో నిలయమై ప్రశాంతమైన దర్శనం కాంతి స్వరూపంతో ఇస్తున్నాడు
నీ యందు జ్ఞానజ్యోతిగా పరజ్ఞాన సంభూతంచే మేధస్సులో నిక్షిప్తమై ప్రజ్ఞానమైన దర్శనం దైవ స్వరూపంతో ఇస్తున్నాడు
ఏనాటి ఆత్మ విజ్ఞానమో ఈనాటికి తెలియని పరిశోధన మానవ మేధస్సులలో అపేక్షణగా సాగుతున్నది
ఏనాటి ఆత్మ వేదనమో ఈనాటికి తెలియని అన్వేషణ మానవ మనస్సులలో ఉపేక్షణగా మారుతున్నది
జీవించుటలో తెలియని విజ్ఞానం మరో ధ్యాసగా సాగే సాధన సమయాన్ని సాగిస్తూ పరిశోధన చేస్తున్నది
స్మరించుటలో తెలియని వేదాంతం మరో దిశగా సాగే ప్రయత్న సమయాన్ని సాగిస్తూ అన్వేషణ చేస్తున్నది
ఎన్నో ఆకార రూపములు చూస్తున్నా ఎన్నో కాల ప్రభావాలు గమనిస్తున్నా తెలియనిది ఎంతో గ్రహించలేమా
ఎన్నో భావ స్వభావాలు తెలుస్తున్నా ఎన్నో కాల తత్త్వములు ధరిస్తున్నా తెలియనిది ఎంతో ఊహించలేమా
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి