మరణించినా పర శ్వాసతో జీవిస్తూనే విశ్వమంతా వ్యాపించి ఉంటాను
అస్తమించినా పర ధ్యాసతో స్మరిస్తూనే జగమంతా విస్తృతమై ఉంటాను
శరీరానికే మరణం పర ఆత్మ శ్వాసలో జీవమై జీవిస్తూనే విశ్వాన్ని తిలకిస్తూ ప్రకృతి రక్షణాభివృద్ధితో పరిశోధనం చేస్తున్నా
దేహానికే శరణం పర ధ్యాస శ్వాసతో గమనమై జీవిస్తూనే జగతిని స్మరిస్తూ ఆకృతి కార్యాచరణతో ప్రయోజనం చేస్తున్నా
పర ఆత్మగా జీవించే వారికి తమ ఆత్మ అంతర్యామిగా పరమాత్మమై విశ్వమంతా విజ్ఞాన పరిశోధన చేస్తూనే జీవిస్తుంది
పర ధ్యాసగా ధ్యానించే వారికి తమ ఆత్మ సర్వాంతర్యామిగా పరశాంతమై జగమంతా జీవన పర్యవేక్షణ చేస్తూనే జీవిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి