7, ఆగస్టు 2026, శుక్రవారం

ఎవరివో నీవు ఎవరివో కనిపించకున్నను వినిపించకున్నను తెలియదే నీవు ఎవరివో

ఎవరివో నీవు ఎవరివో కనిపించకున్నను వినిపించకున్నను తెలియదే నీవు ఎవరివో 
ఎవరివో నీవు ఎవరివో తెలిసినను గ్రహించినను తలచినను చూడలేదే నీవు ఎవరివో 

ఎవరినో నేను ఎవరినో దర్శించలేకున్నా విజ్ఞాన గమనంతో పరిశోధనచే తెలిసేను నేను ఎవరినో  
ఎవరినో నేను ఎవరినో చూడలేకున్నా కార్య భావాల స్వభావాలచే తత్వమై తెలిసేను నేను ఎవరినో 

విజ్ఞాన కార్యములతో నా భావ స్వభావాలు ప్రతి జీవిలో పరిశుద్ధంగా నిక్షిప్తమై తెలిసిపోతున్నాయి 
ప్రజ్ఞాన కార్యక్రమాలతో నా జీవ తత్వములు ప్రతి ధ్యాసలో రక్షణ పరిశీలనమై తలచిపోతున్నాయి 

చూడలేని విజ్ఞానమా పరిశోధన చేయగా విశ్వమే నీ యందు నీలోనే అనంతమై అంతర్భావంతో ఆవరించిపోవును 
జాడలేని గమనమా అన్వేషణ చేయగా జగమే నీ యందు నీతోనే సర్వాంతమై అంతరాత్మమంతో ఆవిష్కరించిపోవును  

తెలుసుకో నీవు ఎవరివో తెలుసుకో ఎవరినో నేను ఎవరినో తెలుసుకో పరిశోధనమా 
తెలుపుకో నీవు ఎవరివో తెలుపుకో ఎవరినో నేను ఎవరినో తెలుపుకో పర్యవేక్షణమా 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి