విశ్వాంతర ప్రయాణము ఎక్కడికి సాగుతున్నదో ఎవరికి తెలియుటలేదు
కాలాంతర చలనముతో విశ్వాన్ని సాగిస్తూ ముందుకు వెళ్ళుతున్నాము
జీవన విధానముతో సాధించే నేటి జీవిత అభివృద్ధి స్వార్థంతో సాగుతున్నది
విజ్ఞాన పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళినా భవిష్య పరులతో పతనమౌతున్నది
నేటి విజ్ఞాన పరిశ్రమలలో ఎన్ని లోపాలో వేతన భత్యములతో తెలియును
చాలి చాలని వేతనాల జీవితాలను సాగించుట భవిష్య పరిశ్రమల అత్యాశయే మిత్రమా!
కాగితాల దూరవాణిలో జీవించుటకు ప్రయత్నించకు మేధస్సులలో జీవిస్తూ సాగిపో