ఎంతటి భాగ్యమో మానవ జీవితం
ఏనాటి బంధమో మానవ జననం
ఎలాంటి యోగమో మానవ జాగృతం
ఎంతెంత సౌభాగ్యమో మానవ దేహానికి విశ్వతి మందిరం
ఎంతెంత సౌఖ్యమో మానవ మేధస్సుకు ప్రకృతి విజ్ఞానం || ఎంతటి ||
ఎంతటి రూపమో ఏనాటి నిర్మాణమో ఎలాంటి శాస్త్రమో
ఎక్కడి ప్రదేశమో ఏ వేద విజ్ఞానమో ఎందుకో అద్భుతమో
ఆశ్చర్యాల అద్భుత ఆకార వర్ణ గంధాలు అతిశయమే
శాస్త్రీయ సాంకేతిక నైపుణ్య లిపి శిల్పాలు అమోఘమే || ఎంతటి ||
బంధాలతో సాగే తరతరాల యుగాలు యోగాల అనురాగమే
అందాలతో కలిగే సౌందర్యాల సుగంధాలు భోగాల సౌఖ్యమే
ఆకారాలతో సమకూర్చే రూపాల ఆకృతులు ఆశ్చర్యమే
సువర్ణాలతో పొదిగించే చేనేత కళా కృతులు అద్భుతమే || ఎంతటి ||