Saturday, August 4, 2018

ఎటు చూసినా నీవే ఎటు వెళ్ళినా నీవే దేవా!

ఎటు చూసినా నీవే ఎటు వెళ్ళినా నీవే దేవా!
ఎటు తలచినా నీవే ఎటు మలచినా నీవే దేవా!

ఏది పలికినా నీవే ఏది పిలిచినా నీవే దేవా!
ఏది అడిగినా నీవే ఏది కలిగినా నీవే దేవా!

సర్వం నీవే భూతం నిత్యం నీవే పంచభూతం దేవా!
దైవం నీవే తారకం దివ్యం నీవే దశావతారకం దేవా!   || ఎటు ||

విశ్వమై వచ్చావు జగమై వెలిశావు మేఘమై కురిశావు నీవే
దేహమై వచ్చావు ధర్మమై వెలిశావు ఆత్మమై వెలిగావు నీవే

శాంతమై ఉన్నావు ప్రశాంతమై కదిలావు తేజమై చలించావు నీవే
మౌనమై ఉన్నావు భావనమై కదిలావు ప్రజ్వలమై ప్రకాశించావు నీవే   || ఎటు ||

తత్వమై ఎదిగావు దివ్యమై ఒదిగావు మూలమై నిలిచావు నీవే
శ్వాసవై దాగావు ఉచ్చ్వాసవై వస్తావు నిశ్శబ్దమై చలిస్తావు నీవే

అణువై జన్మించావు పరమాణువై ఉద్భవించావు జీవమై అధిరోహించావు నీవే
ఆకారమై వరించావు అపురూపమై ధరించావు అవధానమై ఆదర్శించావు నీవే   || ఎటు ||

No comments:

Post a Comment