Friday, November 30, 2018

ఎందరో మరెందరో మహాత్ములు ఉదయించారు

ఎందరో మరెందరో మహాత్ములు ఉదయించారు
ఎందరో మరెందరో మహానుభావులు ఉద్యమించారు

ఎందరు మరెందరో మహర్షులు అవతరించారు
ఎందరో మరెందరో మహనీయులు అధిరోహించారు

ఇంకా ఎందరో మరెందరో జీవిస్తూనే ఉన్నారు
ఇంకా ఎందరో మరెందరో జన్మిస్తూనే ఉంటారు   || ఎందరో  ||

మనిషిగా ఎదిగిన వారే మరో మనిషిగా మహోన్నతమై సాగుతారు
మనిషిగా ఒదిగిన వారే మరో మనిషిగా మహోజ్వలమై వెలుగుతారు

ఋషిగా మహా ఋషిగా జీవించే వారే దైవర్షిగా అవతరించెదరు
ఋషిగా మహా ఋషిగా జన్మించే వారే బ్రంహర్షిగా అధిరోహించెదరు  || ఎందరో  ||

మనిషిగా మరో మనిషిని చూసేవారు మహోత్తరమై సాగెదరు
మనిషిగా మరో మనిషిని తలిచేవారు మహాతత్వమై నిలిచెదరు

ఆత్మగా మరో ఆత్మను దర్శించేవారే మహాత్మగా ఉదయించెదరు
ఆత్మగా మరో ఆత్మను ఆదరించేవారే మహతిగా ఉద్యమించెదరు  || ఎందరో  || 

No comments:

Post a Comment