మేఘం అలిగినా మేఘం కదిలినా
మేఘం పలికినా మేఘం నడిచినా
జగమే జలమై ప్రకృతి వనమై ఎదిగేను మనకై
మేఘం కురిసినా మేఘం ఉరిమినా
మేఘం వణికినా మేఘం వరించినా
జగమే జలమై ప్రకృతి వనమై ఎదిగేను మనకై || మేఘం ||
జలమే జల్లులుగా జలాశయమై సాగిన జలజీవ జలపాతమే మన సాగరమాయే
జలమే జల్లులుగా జలజలమై పారిన జలజీవ జలధారయే మన ప్రాంతమాయే
జలమే జీవమై జలమున జీవనమై జలాంతర వనమై జీవులకే జీవితమాయే
జలమే జగమై జలమున జీవనమై జలధారపు జీవమై జీవులకే జగత్తరమాయే || మేఘం ||
జలమే మేఘం జలమే జీవం జలమే జీవన తరంగ సాగరం
జలమే జలజం జలమే జీవం జలమే జీవిత పరంగ జలపరం
జలమే జఠిలం జలమే జనకం జలమే జీవుల జలచర రూపం
జలమే జపనం జలమే జగణం జలమే జీవుల జలచర జలకం || మేఘం ||