Saturday, February 23, 2019

వినబడుతుందా యదలోని గమనం

వినబడుతుందా యదలోని గమనం
కనబడుతుందా మదిలోని చలనం
తడబడుతుందా మనలోని మౌనం

నిశ్చలమే లేని మానవ హృదయం
మేధస్సుకే తెలిసిన నిత్య గమనం
దేహంలో కలిగే శాస్త్రీయ సిద్ధాంతాల నియమం  || వినబడుతుందా ||

జీవించుట ఒక తపనం చలించుట ఒక కార్యం
భరించుట ఒక మౌనం ధరించుట ఒక శాస్త్రం

గమనించుట ఒక సిద్ధాంతం గ్రహించుట ఒక యోగం
వినిపించుట ఒక శాస్త్రీయం నడిపించుట ఒక భోగం     || వినబడుతుందా ||

ఆచరించుట ఒక నియమం ఆకర్షించుట ఒక నాదం
సందర్శించుట ఒక చలనం స్మరించుట ఒక వేదం

దీవించుట ఒక ఆశయం సాధించుట ఒక కర్తవ్యం
ఆశ్రయించుట ఒక సహాయం ఆదేశించుట ఒక కావ్యం   || వినబడుతుందా || 

దూరం అంటే దూరం ఆహా ఎంత దూరం

దూరం అంటే దూరం ఆహా ఎంత దూరం
దూరం అంటే దూరం ఓహో ఎంతో దూరం

దూరంగానే ఉంది మహా మౌనంతో చూస్తే
దూరంగానే ఉంది మహా వైనంతో చూస్తే

దూరంగానే ఉన్నా ఎవరూ చూడలేని దూరం
దూరంగానే ఉన్నా ఎవరూ వెళ్ళలేని దూరం    || దూరం ||

తెలియని దూరం తెలుసుకోలేని కొత్త దూరం
తోచలేని దూరం తలుచుకోలేని గొప్ప దూరం 

తపనంతో తడబడుతున్నా నడకలు వేస్తే తెలియదా దూరం
విరహంతో విడిపోతున్నా అడుగులు వేస్తే తెలియదా దూరం   || దూరం ||

కొలతలు వేస్తే తెలియదా ఎంతైనా తెలుసుకునే దూరం
పరుగులు వేస్తే తోచదా ఎంతైనా అందుకునే దూరం

విజ్ఞానం తెలుపదా కొలతల గణాంకాల దూరం
అనుభవం తెలుపదా అంచనాల సాహసాల దూరం  || దూరం ||

స్నేహ బంధాలు తెలుపవా మన సిద్ధాంతాల దూరం
ప్రేమ బంధాలు తెలుపవా మన శాస్త్రీయాల దూరం

పరిశోధనలు తెలుపవా శ్రమించిన ప్రతి ఫలాల దూరం
అన్వేషణలు తెలుపవా గడించిన కాల సమయాల దూరం  || దూరం ||

ప్రయాణించినా సమయం తెలుపదా గమ్యం ఎంతో దూరం
వేచియున్నా ఆయుస్సు తెలుపదా మరణం ఎంతో దూరం

జీవించిన శ్రేయస్సుకు తోచదా జీవితం ఎంతో దూరం
విహరించిన వయస్సుకు తోచదా జీవనం ఎంతో దూరం  || దూరం ||

సాగలేని దూరాన్ని సాగించేను ఓ మహా జీవం
నడవలేని దూరాన్ని నడిపించేను ఓ గొప్ప బంధం

వెళ్ళలేని దూరాన్ని చేర్చేను గమ్యం ఓ మహా కార్యం
తోచలేని దూరాన్ని చేర్చేను మోక్షం ఓ మహా యజ్ఞం   || దూరం ||

Tuesday, February 19, 2019

ప్రతి మనిషిలో జీవించెదనా ప్రతి శ్వాసనై

ప్రతి మనిషిలో జీవించెదనా ప్రతి శ్వాసనై
ప్రతి మనిషిలో మరణించెదనా పర శ్వాసనై

ప్రతి జీవిలో ఉదయించెదనా ప్రతి భావమై
ప్రతి జీవిలో అస్తమించెదనా పర తత్వమై

ప్రతి అణువులో ఒదిగిపోయెదనా ప్రతి రూపమై
ప్రతి పరమాణువులో ఎదిగిపోయెదనా పర ఆకృతినై    || ప్రతి మనిషిలో ||

ధ్యాసనై ఉన్నా పర ధ్యాసలో పరంధామనై జీవిస్తున్నా
శ్వాసనై ఉన్నా పర శ్వాసలో పరమాత్మనై విహరిస్తున్నా

జీవమై ఉన్నా పర జీవిలో పరిశుద్ధమై పరిశోధిస్తున్నా
ఆత్మనై ఉన్నా పర ఆత్మలో పరిపూర్ణమై పరిశీలిస్తున్నా   || ప్రతి మనిషిలో ||

ఆకారమై ఉన్నా పరాకృతిలో పరమాణువునై ఎదుగుతున్నా
భావనమై ఉన్నా పరభాణిలో ప్రతిస్పందనమై ఒదుగుతున్నా

క్షణమై ఉన్నా పర్యవేక్షణలో దక్షణమై వీక్షిస్తున్నా
కాలమై ఉన్నా ప్రకారంలో వర్తమానమై అన్వేషిస్తున్నా   || ప్రతి మనిషిలో || 

ఎందుకో ఏమిటో ఎంతవరకో ఈ మహా విశ్వం

ఎందుకో ఏమిటో ఎంతవరకో ఈ మహా విశ్వం
తరతరాలకు తపించే నిరంతరం తన్మయం

ఎవరికో ఏనాటికో ఎక్కడవరకో ఈ మహా తేజం
తరతరాలకు మెప్పించే నిరంతరం అనంతం

ఎందులకో మహా విశాలం ఏనాటికో మహోత్తర విశ్వాలయం
ఎందరికో మహా ప్రశాంతం ఎప్పటికో మహోజ్వల ప్రజ్వాలయం  || ఎందుకో ||

నిరంతర తేజం నిత్యం నిదర్శనం
సర్వాంతర రూపం సర్వం సుదర్శనం

భావాంతర బంధం మధుర మనోహరం
జీవాంతర తత్వం మధుర మహాన్వితం   || ఎందుకో ||

అనంత భావం అపూర్వ స్వరూపం
అఖండ తత్వం అమోఘ పర్వతం

విశాల హృదయం విశ్వాంతర కమలం
ప్రశాంత ప్రదేశం మహాంతర మనోజ్ఞం   || ఎందుకో ||

ప్రజ్వల ప్రకాశం పరిశుద్ధ పరిపూర్ణ ప్రణామం
ఉజ్వల ఉత్తేజం ఉషోదయ ఉత్కంఠ భరితం

దివ్యాంతర దర్పణం దశగుణ దాంపత్యం
విద్యాంతర విజ్ఞానం విశ్వగుణ విశేషణత్వం  || ఎందుకో ||

మేధస్సులోనే సూర్యోదయం

మేధస్సులోనే సూర్యోదయం
మేధస్సులోనే సూర్యానందం

మేధస్సులోనే సూర్య కిరణం
మేధస్సులోనే సూర్య గమనం

మేధస్సులోనే సూర్యాస్తమం
మేధస్సులోనే సూర్యాచలనం  || మేధస్సులోనే ||

మేధస్సులోనే మహా సూర్య వర్ణం
మేధస్సులోనే మహా సూర్య తేజం
మేధస్సులోనే మహా సూర్య జ్ఞానం
మేధస్సులోనే మహా సూర్య భావం
మేధస్సులోనే మహా సూర్య తత్వం   || మేధస్సులోనే ||

మేధస్సులోనే మహా సూర్య లోకం
మేధస్సులోనే మహా సూర్య విశ్వం
మేధస్సులోనే మహా సూర్య జననం
మేధస్సులోనే మహా సూర్య ప్రభాతం
మేధస్సులోనే మహా సూర్య ప్రకృతం  || మేధస్సులోనే ||

మేధస్సులోనే మహా సూర్య కాలం
మేధస్సులోనే మాహా సూర్య కోణం
మేధస్సులోనే మహా సూర్య కార్యం
మేధస్సులోనే మహా సూర్య కాంతం
మేధస్సులోనే మహా సూర్య కేంద్రం   || మేధస్సులోనే ||