నీ శ్వాసనై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ
నీ ధ్యాసనై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ
నీ భావమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ
నీ తత్వమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ
నీ జీవమై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ
నీ రూపమై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ
నీ దేహమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ
నీ దైవమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ || నీ శ్వాసనై ||
విశ్వమంతా వేదమై జగమంతా దివ్యమై విజ్ఞానంతో సాగుతున్నాను
దేశమంతా నాదమై లోకమంతా విద్యనై సాహసంతో సాగుతున్నాను
సాగరమంతా లక్ష్యమై శిఖరమంతా శ్రద్దనై విజయంతో నిలిచిపోయాను
సమయమంతా దీక్షనై కాలమంతా యజ్ఞమై సహనంతో నిలిచిపోయాను || నీ శ్వాసనై ||
మేధస్సంతా మౌనమై మోహమంతా లీనమై ఏకాగ్రతతో నిలిచిపోతున్నా
మనస్సంతా భావమై వయస్సంతా తత్వమై పరిశోధనతో నిలిచిపోతున్నా
ప్రయాణమంతా పర్యావరణమై ప్రదేశమంతా పర్యవేక్షణమై సాగుతున్నా
జీవితమంతా విశ్వాలయమై జీవనమంతా విద్యాలయమై సాగుతున్నా || నీ శ్వాసనై ||