Wednesday, April 17, 2019

ఆలోచన లేదా రాదా నీ మేధస్సులో

ఆలోచన లేదా రాదా నీ మేధస్సులో
ఆలోచన చేయవా తోచదా నీ మేధస్సులో

ఆలోచన కలుగదా ఎదగదా నీ మేధస్సులో
ఆలోచన తెలుపవా తలచవా నీ మేధస్సులో

ఆలోచన లేని నీ మేధస్సు మహా సుకుమారమా  || ఆలోచన ||

ఆలోచనలను అర్థం చేసుకోవా
అర్థాన్నే ఆలోచనగా మార్చుకోవా

అనేక భావాల ఆలోచనలనే గ్రహించవా
అనంత తత్వాల ఆలోచనలనే గమనించవా  || ఆలోచన ||

మహోన్నత ఆలోచనలనే తిలకించలేవా
మహత్తరమైన ఆలోచనలనే పరిశోధించవా

ఆలోచనలనే అనుభవాల అర్థాలుగా మార్చుకోవా
ఆలోచనలనే అనుబంధాల పరమార్థంగా చూసుకోవా  || ఆలోచన ||

ఉపయోగమైన ఆలోచనలనే దాచుకోవా
నిరుపయోగమైన ఆలోచనలనే వదులుకోవా

మేధస్సునే అనంతమైన ఆలోచనలతో నింపుకోవా
మేధస్సునే సుందరమైన ఆలోచనలతో ఉంచుకోవా   || ఆలోచన ||

ఆలోచనలనే ఉపయోగిస్తూ ఐశ్వర్యమే చేసుకోవా
ఆలోచనలనే వినియోగిస్తూ అదృష్టమే చేర్చుకోవా

ఆలోచనలనే అద్భుతంగా మళ్ళించుకోవా
ఆలోచనలనే ఆశ్చర్యంగా మరిపించుకోవా    || ఆలోచన || 

సరిగమలు పలికెదవా పదనిసలు పిలిచెదవా

సరిగమలు పలికెదవా పదనిసలు పిలిచెదవా
సంగీతం పాడెదవా స్వరములను తెలిపెదవా

గమకాల గాన గాంధర్వ గీతములనే శృతించెదవా   || సరిగమలు ||

వేణువుగా శృతించి వేదాలనే పలికెదవా
దరువుగా మెప్పించి చరణాలనే పాడెదవా

తనువుతో శ్వాసించి గేయములనే తలిచెదనా
అరువుతో ధ్యానించి గీతములను తెలిపెదనా    || సరిగమలు ||

చనువుతో అర్పించి స్వరములనే కొలిచెదనా
గురువుతో ఒప్పించి కంఠములనే ఆర్జించెదనా

సత్తువుతో నేర్పించి శృతులనే చేర్చేచెదనా
మధువుతో గర్వించి గానములనే కలిపెదనా   || సరిగమలు || 

Sunday, April 14, 2019

ఓ కాలమా ఏనాడు ఉదయించావో

ఓ కాలమా ఏనాడు ఉదయించావో
ఓ సమయమా ఏనాడు జన్మించావో

క్షణమై ఉదయిస్తూనే సమయమై సాగుతున్నావు
క్షణ క్షణాలుగా సాగుతూనే కాలమై ఎదుగుతున్నావు

నీ కాల సమయంలోనే ఎన్నో కార్యాలు సాగుతున్నాయి
నీ కాల కార్యాలతోనే ఎన్నెన్నో భావాలు మారుతున్నాయి   || ఓ కాలమా ||

జీవిగా జన్మించే సమయం ఎంతటిదో జీవిగా ఎదిగే కాలం ఎంతటిదో
జీవిగా జీవించే సమయం ఎంతటిదో జీవిగా ఒదిగే కాలం ఎంతటిదో

ఎన్నో కార్యాలతో ఎన్నో భావాలు సమయంతో మారుతున్నాయి
ఎన్నో కాలాలతో ఎన్నో తత్వాలు సమయంతో ఎదుగుతున్నాయి   || ఓ కాలమా ||

జీవిగా జీవించే జీవితం కాలంతో సాగే తరతరాల జీవన చదరంగం
జీవిగా జన్మించే విజేతం కాలంతో సాగే యుగయుగాల జనన విధానం

ఎన్నో కార్యాలతో ఎన్నో బంధాలు సమయంతో సాగుతున్నాయి
ఎన్నో కాలాలతో ఎన్నో స్నేహాలు సమయంతో కలుగుతున్నాయి   || ఓ కాలమా || 

Thursday, April 4, 2019

నీవే శ్వాసగా నీవే ధ్యాసగా నాలో చేరవా

నీవే శ్వాసగా నీవే ధ్యాసగా నాలో చేరవా
నీవే జీవమై నీవే ధ్యానమై నాలో చేరవా

నీవే వేదమై నీవే జ్ఞానమై నాలో చేరవా
నీవే భావమై నీవే తత్వమై నాలో చేరవా

ఎవరూ లేని చోట ఎవరూ రాని చోట ఏకాంతమై విశ్వమే గమనించావా
ఏదో తెలిసే చోట ఎంతో తలిచే చోట ఆకాశమై జగమే నీవై తిలకించవా   || నీవే ||

శ్వాసలో ఉన్న చలనం ధ్యాసలో ఉన్న గమనం మేధస్సులో చేరేనా
జీవమై ఉన్న దేహం ధ్యానమై ఉన్న దైవం మేధస్సులో చేరేనా

వేదమై ఉన్న వదనం జ్ఞానమై ఉన్న జ్ఞాపకం మేధస్సులో చేరేనా
భావమై ఉన్న బంధం తత్వమై ఉన్న తపనం మేధస్సులో చేరేనా  || నీవే ||

శ్వాసతో కలిగే మౌనం ధ్యాసతో కలిగే మోహం మేధస్సుకు అందేనా
జీవంతో కలిగే చలనం ధ్యానంతో కలిగే గమనం మేధస్సుకు అందేనా

వేదంతో కలిగే వచనం జ్ఞానంతో కలిగే అనుభవం మేధస్సుకు అందేనా
భావంతో కలిగే ప్రేమం తత్వంతో కలిగే మిథునం మేధస్సుకు అందేనా   || నీవే ||