Friday, April 29, 2022

శుభం తెలుపుతున్నది నీవు ఉదయించుటలో

శుభం తెలుపుతున్నది నీవు ఉదయించుటలో 
శౌర్యం పలుకుతున్నది నీవు ఉద్భవించుటలో 

శిఖరం తెలుపుతున్నది నీవు ప్రయాణించుటలో 
శతకం పలుకుతున్నది నీవు ప్రస్తావించుటలో 

Wednesday, April 27, 2022

ఉదయంతో జీవితం హృదయంతో జీవనం

ఉదయంతో జీవితం హృదయంతో జీవనం 
ఉదయంతో ఉత్తేజం హృదయంతో హుంకృతం 

ఉద్భవంతో ఉజ్జీవం ఉద్యమంతో ఉద్యానం 
ఉపేక్షణతో ఉద్దార్కం ఉపాయంతో ఉత్కారం

అపేక్షణతో అద్భుతం అన్వేషణతో ఆశ్చర్యం 
ఆలోచనతో అత్యంతం ఆచరణతో ఆద్యంతం

అభయంతో అభ్యాసం అభిజ్ఞంతో అపూర్వం 
ఆధారంతో అధ్యాయం అఖిలంతో అమృతం