Friday, June 3, 2022

ఎవరైనా ఉన్నారా ఈ విశ్వంలో

ఎవరైనా ఉన్నారా ఈ విశ్వంలో 
ఎవరైనా విన్నారా ఈ విశ్వంలో 

ఎవరికైనా తెలిసేనా ఈ విశ్వంలో 
ఎవరికైనా తెలిపేనా ఈ విశ్వంలో 

విశ్వంతోనే జీవిస్తున్నా విశ్వంతోనే ధ్యానిస్తున్నా 
విశ్వంతోనే శ్వాసిస్తున్నా విశ్వంతోనే స్మరిస్తున్నా 

విశ్వంతోనే ప్రయాణిస్తున్నా విశ్వంతోనే పరిశోధిస్తున్నా 
విశ్వంతోనే పరిభ్రమిస్తున్నా విశ్వంతోనే పరితపిస్తున్నా 

విశ్వంతోనే ఉదయిస్తున్నా విశ్వంతోనే ప్రకాశిస్తున్నా 
విశ్వంతోనే అస్తమిస్తున్నా విశ్వంతోనే ప్రజ్వలిస్తున్నా 

విశ్వమంటేనే నాలో సూర్యదయం విశ్వమంటేనే నాలో మహోదయం 
విశ్వమంటేనే నాలో చంద్రోదయం విశ్వమంటేనే నాలో పూజ్యోదయం 

విశ్వంలోని విజ్ఞానమంతా నా మేధస్సులోనే చేరుతున్నదే 
విశ్వంలోని ప్రభావమంతా నా దేహస్సులోనే చేరుతున్నదే