జన సేనవో జన గానవో
జన వాడివో జన వాణివో
జన జనతవో జన యువతవో
జన చరితవో జన భారతవో || జన ||
జనులకే జాగృతివో జనులకే జనశృతివో
జనులకే ఐక్యతవో జనులకే సమైక్యతవో
జనార్దనా జనులలో హిత మన్ననవో
జనార్ధనా జనులలో హిత అర్థనవో
మహోత్తమా జనులయందు నీవే మహోదయమా
మహోత్సాహ జనులయందు నీవే మహోత్తరమా || జన ||